cloudfront

Advertisement


Home > Movies - Press Releases

'విశ్వామిత్ర' లోగో విడుదల

'విశ్వామిత్ర'  లోగో విడుదల

రాజ్‌కిరణ్‌ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'విశ్వామిత్ర'. నందితరాజ్‌, సత్యం రాజేశ్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో అశుతోష్‌ రాణా విడుదల చేశారు. 

ఈ సందర్భంగా .. అశుతోష్‌ రాణా మాట్లాడుతూ - ''తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్‌ ఉంది. ఈ సినిమాలో నేను పొసెసివ్‌ భర్త పాత్రలో కనపడతాను. రాజ్‌కిరణ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు'' అన్నారు. 

చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్‌ మాట్లాడుతూ - ''ప్రస్తుతం హారర్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలదే హవాగా ఉంది. ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. అది ఇప్పటికి తీరింది. సత్యం రాజేశ్‌ హీరో అని చెప్పగానే చాలా మంది డ్రాప్‌ అయ్యారు. కానీ నందితరాజ్‌ కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను. నా మిత్రుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు మాటలను అందించారు. అలాగే మరో స్నేహితుడు బి.వి.ఎస్‌.రవిగారి సహకారం కూడా మరువలేనిది'' అన్నారు. 

సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ '' కథ పరంగా నాది హీరో క్యారెక్టర్‌ కాదు. కానీ ప్రాముఖ్యత ఉన్న పాత్ర. ఈ సినిమాకు మాటలు అందించిన వంశీకృష్ణగారికి థాంక్స్‌'' అన్నారు. 

నిర్మాత మాధవి మాట్లాడుతూ ''కథ వినగానే బాగా నచ్చడంతో సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేసేశాం. యు.ఎస్‌, స్విజర్లాండ్‌లో జరిగిన యదార్ధ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదొక థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీ. తెలుగు సినిమాల్లో రాని కథాంశంతో వస్తోన్న సినిమా'' అన్నారు.