cloudfront

Advertisement


Home > Movies - Trade Talk

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

జనవరి మొదటి వారంలో చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటీ రాలేదు. జనవరి 9నుంచే సంక్రాంతి సినిమాల సందడి మొదలవడంతో చిన్న చిత్రాలు ధైర్యం చేయలేదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటిభాగం మొదటిరోజు ఒక మాదిరి వసూళ్లు మాత్రం తెచ్చుకోగలిగింది. భారీ స్థాయిలో స్పందన వుంటుందని ఆశిస్తే ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే వచ్చింది.

సినిమా బాగా తీసారనే టాక్‌ వినిపిస్తున్నా కానీ ఎందుకో పబ్లిక్‌ నుంచి సరయిన స్పందన లేదు. సంక్రాంతి టైమ్‌లో పికప్‌ అవుతుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. రజనీకాంత్‌ పేట చిత్రం ఇటీవల ఆయన నటించిన సినిమాల్లో బెటర్‌గా వుందంటున్నారు కానీ థియేటర్లు సరిపడా లేకపోవడంతో వసూళ్లు సరిపడా రావడం లేదు.

శుక్రవారం విడుదలైన వినయ విధేయ రామ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్‌ వచ్చింది కానీ టాక్‌ మాత్రం అస్సలు ఆశాజనకంగా లేదు. ఎఫ్‌2 కూడా వచ్చిన తర్వాత అదెలావుందో తెలిసాక ఇక పండక్కి ఏ సినిమా ఆడుతుందో, ఏది పక్కకి జరుగుతుందో తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే నిర్మాతలందరూ సంక్రాంతి సెలవులపై హోప్స్‌ పెట్టుకున్నారు.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?