Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

 ఈవారం ట్రేడ్‌ టాక్‌

మాస్‌ సినిమా లెవల్‌ ఏంటో 'ఇస్మార్ట్‌ శంకర్‌' చూపిస్తోంది. విడుదలకి ముందే విశేషమైన క్రేజ్‌ రాబట్టుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు ఏడు కోట్లకి పైగా షేర్‌ సాధించింది. ఇందులో దాదాపు సగం నైజాం నుంచే రావడం ట్రేడ్‌ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. పదిహేడు కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం తొలి వారాంతం తిరగకుండా లాభాల బాట పడుతుంది.

పూరి జగన్నాథ్‌ మరోసారి కమర్షియల్‌ డైరెక్టర్‌గా తన సత్తా చాటుకోగా, రామ్‌కి ఈ చిత్రంతో మాస్‌ ఇమేజ్‌ పెరిగింది. ఇదిలావుంటే గతవారం విడుదలైన సినిమాలలో 'నిను వీడని నీడను నేనే' ఫర్వాలేదనిపించుకోగా, 'దొరసాని' డిజాస్టర్‌ అయింది. కొత్త సినిమాలు ఆకట్టుకోలేకపోవడంతో 'ఓ బేబీ' హవా కొనసాగి సూపర్‌హిట్‌ స్టేటస్‌ని దక్కించుకుంది.

మే, జూన్‌లో డల్‌గా వున్న తెలుగు సినిమా బిజినెస్‌ ఇప్పుడు వారానికో హిట్‌ సినిమాతో కళకళలాడుతోంది. చిన్న సినిమాల సందడి ముగిసి ఈవారం 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో మీడియం రేంజ్‌ సినిమాల టైమ్‌ స్టార్ట్‌ అయింది. ఈ శుక్రవారం రానున్న 'డియర్‌ కామ్రేడ్‌'పై కూడా అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. 

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?