Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

అనుకున్నట్టే అయింది. త్రిముఖ పోటీలో కేవలం ఒక సినిమాకే ప్రేక్షకాదరణ దక్కుతోంది. తొలిప్రేమ చిత్రం విజయ పథంలో పయనిస్తూ వుండగా, మిగతా రెండు సినిమాలు దారుణ పరాజయాలని చవిచూసాయి. వినాయక్‌ బ్రాండ్‌ కూడా సాయి ధరమ్‌ తేజ్‌ని కష్టాల నుంచి గట్టెక్కించలేకపోయింది. ఇంటిలిజెంట్‌తో తేజ్‌కి వరుసగా అయిదవ పరాజయం వచ్చింది.

వినాయక్‌ కెరియర్‌లోనే పెద్ద ఫెయిల్యూర్‌గా చెప్పబడుతోన్న ఈ చిత్రం బయ్యర్ల పెట్టుబడిలో నాలుగవ వంతు కూడా తిరిగి రాబట్టుకోవడం కష్టమేనంటున్నారు. గాయత్రి చిత్రంతో మోహన్‌బాబు ఈ తరం ప్రేక్షకులని ఆకర్షించలేకపోయారు. అన్ని చోట్లా చాలా తక్కువ స్థాయి వసూళ్లతో ఈ చిత్రం డిజాస్టర్‌ అయింది.

వరుణ్‌తేజ్‌కి ఫిదా తర్వాత మరో విజయం తొలిప్రేమతో దక్కింది. ప్రస్తుతం స్టడీ వసూళ్లతో నడుస్తోన్న ఈచిత్రం ఈ వారాంతానికి ఎనభై శాతం ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుంది. ఛలో మంచి విజయాన్ని అందుకోగా, భాగమతి కూడా నిర్మాతలకి చక్కని లాభాలు తెచ్చిపెట్టింది. టచ్‌ చేసి చూడు రవితేజ కెరీర్‌లో అతి పెద్ద పరాజయాల జాబితాలో చేరిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?