Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

నాని నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం 'అ' ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకున్నా మెజారిటీ నుంచి తిరస్కారాన్ని చవిచూసింది. నానికి మంచి గుడ్‌విల్‌ వున్న ఓవర్సీస్‌లో ఈ చిత్రం చాలా బాగా ఫేర్‌ చేస్తోంది. ఓవర్సీస్‌ నుంచే రెండున్నర కోట్ల షేర్‌ వచ్చేట్టుంది. అలాగే నైజాంలోను ఈ చిత్రం బాగానే ఆడుతోంది.

సీడెడ్‌, ఆంధ్ర ఏరియాల్లో చెప్పుకోతగ్గ వసూళ్లు లేవు కానీ తక్కువ మొత్తానికి అమ్మారు కనుక పెద్దగా నష్టాలు వుండకపోవచ్చు. మరోవైపు సందీప్‌ కిషన్‌తో మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన 'మనసుకు నచ్చింది' ఎవరి మనసునీ మెప్పించలేకపోయింది.

కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా రాని డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తొలిప్రేమ చిత్రం నెమ్మదిగా హిట్‌ రేంజ్‌ని అందుకుంది. ఇంటిలిజెంట్‌ అటు సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్లోను, ఇటు వినాయక్‌ కెరీర్లోను అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఛలో ఈ ఏడాదికి తొలి బ్లాక్‌బస్టర్‌ అనిపించుకోగా, రవితేజ టచ్‌ చేసి చూడు అతి దారుణమైన ఫ్లాప్‌గా మిగిలింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?