Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

లాస్ట్‌ వీక్‌ చెప్పుకోతగ్గ సినిమా ఏదీ రిలీజ్‌ కాకపోవడంతో పాత సినిమాలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. మార్కెట్లో అప్పటికే వున్న సినిమాలు తొలిప్రేమ, అ, ఛలో వారాంతం వరకు బాగానే సందడి చేసినా ఆ తర్వాత వాటికీ వసూళ్లు లేకుండా పోయాయి.

కొత్త సినిమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నట్టు వసూళ్లున్నాయి. విక్రమ్‌ నటించిన స్కెచ్‌ చిత్రానికి అరకొర వసూళ్లు రాగా, ఆంగ్ల చిత్రం బ్లాక్‌ పాంథర్‌, హిందీ చిత్రం సోను కే టీటూ కీ స్వీటీ హైదరాబాద్‌ మల్టీప్లెక్సుల్లో బాగానే వసూలు చేసాయి.

ఈవారం థియేటర్ల స్ట్రయిక్‌ మొదలు కావడంతో మార్కెట్‌ మరింత ప్రమాదంలో పడే అవకాశముంది. మరి ఈ వివాదాన్ని ఎంత త్వరగా పరిష్కరించుకుంటారనేది తెలియదు కానీ త్వరలో విడుదలకి సిద్ధమవుతోన్న పెద్ద సినిమాలు వచ్చేలోగా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?