Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

థియేటర్ల బంద్‌ తర్వాత మార్కెట్‌కి ఊపునిచ్చే సినిమా రిలీజ్‌ కాకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద స్లంప్‌ మరోవారం కొనసాగింది. విజయ్‌ దేవరకొండ ఎప్పుడో చేసిన 'ఏ మంత్రం వేసావె' విడుదలైనా కానీ ఎవరూ పట్టించుకోలేదు. హీరోనే త్యజించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సయితం లైట్‌ తీసుకున్నారు.

బంద్‌కి ముందు థియేటర్లలో వున్న సినిమాలకి కూడా వసూళ్లు లేకపోవడంతో మరో వారం రోజుల పాటు థియేటర్లు వెలవెలబోయాయి. మళ్లీ ఈ వారంనుంచి సినీ సందడి కనిపించనుంది. కిరాక్‌ పార్టీతో పాటు కర్తవ్యం రిలీజ్‌ అయింది. నిఖిల్‌ నటించిన కిరాక్‌ పార్టీపై యూత్‌ దృష్టి పడింది. మరి ఈ ఆసక్తి వసూళ్లుగా కన్వర్ట్‌ అవుతుందా లేదా అనేది చూడాలి.

ఐతే 2.0తో పాటు మాస్‌కి నచ్చిన ఫ్రాంచైజీ దండుపాళ్యం నుంచి మూడో ఎడిషన్‌ ఈ వారం థియేటర్లలోకి వచ్చాయి. ఇకపై వారానికో చెప్పుకోతగ్గ సినిమా విడుదలవుతుంది కనుక మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద కళ నెలకొంటుందనే నమ్మకం కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది టాలీవుడ్‌కి చాలా నీరసంగా మొదలైంది. వేసవి సినిమాలతో అయినా ఆ ఊపు తిరిగి వచ్చేస్తుందనే ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?