Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

విడుదలకి ముందు ఆసక్తి రేకెత్తించిన 'కిరాక్‌ పార్టీ' తొలి రోజు యువతని బాగానే ఆకర్షించింది కానీ మేటర్‌ లేకపోవడంతో వెంటనే డ్రాప్‌ అయింది. ఈ సినిమాని నిలబెట్టడం కోసం థియేటర్స్‌ టూర్లు గట్రా చేస్తున్నప్పటికీ ఈ చిత్రం వసూళ్లు బాగా క్షీణించాయి. తక్కువ రేట్లకే అమ్మిన ఈ చిత్రం గట్టెక్కడానికి కూడా కష్టపడుతుందనేది ట్రేడ్‌ టాక్‌.

ఇక గత వారం విడుదలైన నయనతార చిత్రం కర్తవ్యంకి మంచి టాక్‌ అయితే వచ్చింది కానీ వసూళ్లు లేవు. చాలా చోట్ల థియేటర్‌ రెంట్లు కూడా వసూలు చేయలేకపోయిన ఈ చిత్రం కొన్నవారికి పూర్తి నష్టాలు మిగిల్చింది. వచ్చే వారం రంగస్థలం రిలీజ్‌ వుండడంతో చిన్న సినిమాలన్నీ కట్టకట్టుకుని ఈవారం విడుదలయ్యాయి.

కళ్యాణ్‌రామ్‌ నటించిన ఎంఎల్‌ఏతో పాటు నీదీ నాదీ ఒకే కథ, రాజరథం తదితర చిత్రాలు ఈ వారం విడుదల కాగా, వీటిలో వచ్చే వారం వరకు సర్వయివ్‌ అయ్యేది ఏదనేది చూడాలి. వచ్చే వారం నుంచి ప్రతి శుక్రవారం ఒక నోటబుల్‌ రిలీజ్‌ వుండడంతో బాక్సాఫీస్‌ మళ్లీ కళకళలాడుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?