Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

రంగస్థలంపై పెట్టుకున్న అంచనాలకి, ఆశలకి మించిన విజయాన్నే ఈ చిత్రం సాధించింది. వారం తిరిగే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఎనభై కోట్ల షేర్‌ వసూలు చేసిన ఈ చిత్రం వంద కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. ఈ వారాంతానికి ఆ మైలురాయి చేరిపోతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దాదాపుగా అన్ని ఏరియాల్లోను ఎనిమిదివ రోజుకి లాభాల్లోకి ఎంటర్‌ అవుతోన్న రంగస్థలం ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ వసూళ్లతో రన్‌ అవుతోంది. దీంతో 'భరత్‌ అనే నేను' వచ్చే వరకు స్టడీగా షేర్లు రావడం ఖాయమనిపిస్తోంది. 'ఖైదీ నంబర్‌ 150' వసూళ్లని దాటి 'నాన్‌ బాహుబలి' రికార్డుని సాధించడం తథ్యమని ట్రేడ్‌ టాక్‌.

ఇదిలావుంటే ఈవారంలో విడుదలైన నితిన్‌ చిత్రం 'ఛల్‌ మోహన్‌ రంగ'కి డీసెంట్‌ ఓపెనింగ్‌ వచ్చింది. నితిన్‌ గత చిత్రం 'లై' పోటీ వాతావరణంలో విడుదలై దెబ్బతింది. కానీ ఈసారి ఈ చిత్రానికి మంచి ఆరంభమే వచ్చింది. అయితే సినిమాలో కామెడీ తప్ప మరేమీ లేదనే టాక్‌ రావడం వల్ల వారాంతం ముగిసిన తర్వాత వసూళ్ల పరంగా ఇబ్బందులు తప్పవనిపిస్తోంది.

ఈ యేడాదిలో భారీ విజయం లేని కొరతని రంగస్థలం తీర్చేయడంతో త్వరలో రాబోతున్న భరత్‌ అనే నేను, నా పేరు సూర్య లాంటి భారీ చిత్రాలకి గిరాకీ పెరిగింది. బి, సి సెంటర్స్‌ నుంచి వీటికి మంచి హైర్లు వస్తున్నట్టు ట్రేడ్‌ టాక్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?