Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

అనుకున్నట్టే రెండవ వారం ముగిసే సరికి వంద కోట్ల పైగా షేర్‌తో రంగస్థలం ఎలీట్‌ క్లబ్‌లో చేరిపోయింది. బాహుబలి చిత్రాలతో పాటు ఖైదీ నంబర్‌ 150కి మాత్రమే ఈ క్లబ్‌లో ఇంతకాలం చోటుంది. ఇప్పటికీ స్టడీ కలక్షన్స్‌తో రన్‌ అవుతోన్న రంగస్థలం మరో వారం రోజుల పాటు షేర్స్‌ సాధిస్తుంది. అంతిమంగా నూట పది కోట్ల షేర్‌కి దరిదాపుల్లో నిలిచి నాన్‌ బాహుబలికి కొత్త రికార్డు సెట్‌ చేయడం ఖాయమని తేలింది.

ఇకపోతే గత వారం విడుదలైన నితిన్‌ చిత్రం 'ఛల్‌ మోహన్‌ రంగ' నిరాశ పరిచింది. మొదటి రోజు చెప్పుకోతగిన వసూళ్లు వచ్చినా బ్యాడ్‌ టాక్‌ రావడం వల్ల రంగస్థలం ధాటికి నిలబడలేకపోయింది. లైతో ఘోర పరాజయాన్ని చవిచూసిన నితిన్‌కి వరుసగా మరో ఫ్లాప్‌ వచ్చింది. దీంతో అతని మలి చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' రిజల్ట్‌ నితిన్‌ కెరీర్‌కి కీలకమవుతుంది.

గురువారం విడుదలైన నాని చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' ఓపెనింగ్‌ డీసెంట్‌ అయినప్పటికీ నాని గత చిత్రం 'ఎంసిఏ'తో పోలిస్తే చాలా తక్కువ. ఈ చిత్రానికి టాక్‌ కూడా అనుకూలంగా లేకపోవడంతో ఈసారి నాని దీనిని ఎంత వరకు పుల్‌ చేస్తాడనేది ఆసక్తికరమైంది. వచ్చే వారం బాక్సాఫీస్‌ని భరత్‌ అనే నేను టేకోవర్‌ చేస్తుంది కనుక మార్కెట్లో వున్న సినిమాలన్నిటికీ మాగ్జిమం క్యాష్‌ చేసుకోవడానికి ఒక వారమే సమయం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?