Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

రంగస్థలం లాంఛనం పూర్తి చేసేసింది. గత వారమే వంద కోట్ల షేర్‌ మార్కు దాటిన ఈ చిత్రం మూడవ వారంలో ఖైదీ నంబర్‌ 150 వసూళ్లని దాటి నాన్‌-బాహుబలి రికార్డుని సాధించింది. భరత్‌ అనే నేను చిత్రానికి భారీ టార్గెట్‌ సెట్‌ చేసి పెట్టింది. ఇప్పటికీ షేర్స్‌ మీద నడుస్తోన్న ఈ చిత్రానికి ఇంకాస్త రన్‌ రావచ్చునని ట్రేడ్‌ అంటోంది.

అందుకే భరత్‌ అనే నేను చిత్రం వచ్చినా కానీ ఫుల్స్‌ మీద నడుస్తున్న రంగస్థలంకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు నాలుగవ వారంలోను కేటాయించారు. ఇకపోతే గత వారమే విడుదలైన నాని చిత్రం కృష్ణార్జున యుద్ధం అతని హిట్‌ జోరుకి కళ్లెం వేసింది. యావరేజ్‌ సినిమాలతో పాస్‌ అయిపోయిన నానికి ఈ చిత్రంతో గట్టి ఫ్లాప్‌ తగిలింది.

విడుదలకి ముందు గ్యారెంటీ హిట్‌ అంటూ చెప్పిన నాని రిలీజ్‌ అయి టాక్‌ బయటకి వచ్చాక గప్‌చుప్‌ అయిపోయాడు. అంతకుముందు వారం విడుదలైన ఛల్‌ మోహన్‌ రంగ కూడా పెద్ద ఫ్లాప్‌ అయింది. వరుసగా రెండు పరాజయాలతో నితిన్‌ ఆశలు తదుపరి రాబోతున్న దిల్‌ రాజు చిత్రం శ్రీనివాసకళ్యాణం మీదకి మళ్లాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?