cloudfront

Advertisement


Home > Movies - Trade Talk

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

మారుతి బ్రాండ్‌ నేమ్‌కి తోడు స్టార్‌ కాస్ట్‌, మాస్‌ని ఆకర్షించే టైటిల్‌ దోహదపడి 'శైలజారెడ్డి అల్లుడు' ఘనమైన ఓపెనింగ్‌ తెచ్చుకుంది. విడుదలకి ముందే అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్‌తో మొదటిరోజు మంచి వసూళ్లు ఖాయమనిపించిన చిత్రానికి తొలిరోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కానీ వసూళ్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయి. చైతన్య సినిమాల్లో అత్యధిక తొలిరోజు వసూళ్లు తెచ్చుకున్న 'శైలజారెడ్డి అల్లుడు' ఇదే జోరు వీకెండ్‌ వరకు చూపిస్తే కమర్షియల్‌గా పాస్‌ అయిపోతుంది.

వినాయకచవితి రోజునే రిలీజ్‌ అయిన 'యు టర్న్‌' చిత్రానికి కూడా మంచి ఆరంభం దక్కింది. టాక్‌ పరంగా కూడా ఈ చిత్రం ముందంజలో వుంది. సమంతకి వున్న క్రేజ్‌ ఈ చిత్రం ఓపెనింగ్‌ వసూళ్ల ద్వారా మళ్లీ తెలిసింది. ఇకపోతే గతవారం విడుదలైన 'సిల్లీ ఫెలోస్‌' చిత్రం ఫస్ట్‌ వీకెండ్‌ తర్వాత బాగా నెమ్మదించింది. రెండు క్రేజీ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి కనుక సెకండ్‌ వీకెండ్‌పై ఎక్కువ హోప్స్‌ లేవు.

కేరాఫ్‌ కంచరపాలెం చిత్రం ఆ బడ్జెట్‌కి డీసెంట్‌ పర్‌ఫార్మెన్స్‌ చూపించింది కానీ మెజారిటీ ఆడియన్స్‌ని రీచ్‌ కాలేకపోయింది. మను చిత్రానికి హడావిడి ఎక్కువ జరిగినా కలక్షన్ల పరంగా అసలు ప్రభావం చూపించలేక ఫెయిలయింది. గీత గోవిందం నాలుగు వారాల పాటు బాక్సాఫీస్‌ని డామినేట్‌ చేసి, ఈవారంలో కొత్త సినిమాలకి దారిచ్చేసింది.