cloudfront

Advertisement


Home > Movies - Trade Talk

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

గతవారం విడుదలైన 'సవ్యసాచి' డిజాస్టర్‌గా మిగిలింది. మొదటి వారాంతంలోనే వసూళ్లు సరిగా రాని సవ్యసాచికి మంగళవారం నుంచి కొత్త సినిమాల రాకతో పూర్తిగా బ్రేక్‌ పడింది. ఈ చిత్రం చైతన్య సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ ఫ్లాప్స్‌ అనిపించుకుంది. ఇక మంగళవారం విడుదలైన విజయ్‌ చిత్రం 'సర్కార్‌'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిగినింగ్‌ దక్కింది.

దీపావళి హాలిడేని క్యాష్‌ చేసుకున్న ఈ చిత్రం సక్సెస్‌ దిశగా దూసుకు పోతోంది. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మాస్‌ ఆదరణకి నోచుకుంది. ఇది వచ్చిన మర్నాడే విడుదలైన 'అదుగో' డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో సర్కార్‌కి ఎదురు లేకుండా పోయింది.

గురువారం విడుదలైన 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' కూడా డిజాస్టర్‌ అవడం సర్కార్‌కి మరింత బూస్ట్‌ ఇచ్చింది. ఈ వారాంతంలో సర్కార్‌ డామినేషన్‌ కొనసాగుతుంది. వచ్చే వారంలోను రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి.

రవితేజ నటించిన 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' ముందుగా శుక్రవారం విడుదలవుతోంటే, విజయ్‌ దేవరకొండ నటించిన టాక్సీవాలా శనివారం నుంచి రైడ్‌ మొదలు పెడుతుంది. 

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్