Advertisement

Advertisement


Home > Movies -

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లో ఒక్కటి మాత్రమే ఘన విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ డిజాస్టర్‌ దిశగా సాగుతోంది. అనూహ్యంగా ఈ చిత్రానికి కనీస స్పందన కూడా రాకపోయింది. డెబ్బయ్‌ కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రానికి ఇరవై కోట్ల షేర్‌ రావడం గగనమనిపిస్తోంది.

రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సినిమా అనేసరికి బయ్యర్లు భారీ రేట్లకి కొనేసారు. కానీ 'వినయ విధేయ రామ' బోయపాటి చిత్రాల్లోనే వీకెస్ట్‌ అనిపించుకోవడంతో మొదటి రోజే పరాజయం ఖరారయిపోయింది.

మాస్‌ సినిమా కావడంతో, సంక్రాంతికి రిలీజ్‌ చేయడం వల్ల ఘోర పరాజయాన్ని తప్పించుకోగలిగింది. మొదటి వారంలో యాభై కోట్ల పైచిలుకు షేర్‌ సాధించిన ఈ చిత్రం అరవై కోట్లకి అటు ఇటుగా ఆగేట్టు వుంది. అదే జరిగితే బయ్యర్లకి భారీ నష్టాలు తప్పవు.

రజనీకాంత్‌ 'పేట' పంతం కొద్దీ మూడు భారీ స్ట్రెయిట్‌ సినిమాలతో విడుదల చేసి మూల్యం చెల్లించుకున్నారు. తగినన్ని థియేటర్లు దొరక్క ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 'ఎఫ్‌ 2' మాత్రం ప్రోమోలతో ఎలాంటి చిత్రమనే భావన కలిగించిందో అందుకు తగ్గట్టే అని డంతో బాక్సాఫీస్‌ వద్ద విజయ దుందుభి మోగిస్తోంది.

ఫుల్‌ రపన్‌లో యాభై కోట్ల షేర్‌ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?