cloudfront

Advertisement


Home > Movies - Trade Talk

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

పరీక్షల సీజన్‌కి భయపడి నిర్మాతలంతా తమ సినిమాలని వేసవి సెలవుల సమయానికి షెడ్యూల్‌ చేసుకోవడంతో బాక్సాఫీస్‌ డల్‌గా వుంది. 118 చిత్రం సక్సెస్‌ అయినా కానీ ప్రస్తుతం సినిమాలు లేని పరిస్థితిని మరీ ఎక్కువగా క్యాష్‌ చేసుకోలేకపోయింది. ఈ వారం కూడా నోటబుల్‌ రిలీజ్‌లు ఏమీ లేకపోవడంతో మరో వారం రోజుల పాటు స్తబ్ధత నెలకొంటుంది.

తెలుగు సినిమా వ్యాపారం డల్‌గా వుంటే బాలీవుడ్‌కి మాత్రం వరుస హిట్లు వస్తున్నాయి. ప్రతి వీకెండ్‌ ఏదో ఒక సినిమా అయినా హిట్టవుతూ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కళకళలాడిపోతోంది. ఊరి తర్వాత గల్లీబాయ్‌, టోటల్‌ ధమాకా చిత్రాలు విజయవంతం కాగా, రీసెంట్‌గా వచ్చిన లుకా చుప్పీ, బద్లా చిత్రాలకి కూడా ఆదరణ బాగుంది.

లుకా చుప్పీ ఎనభై కోట్ల నెట్‌ వసూళ్లు సాధించే దిశగా సాగుతోంటే, బద్లా కూడా యాభై కోట్ల మార్కుని దాటనుంది. ఆంగ్ల చిత్రం కెప్టెన్‌ మార్వల్‌కి కూడా మంచి ఓపెనింగ్‌ లభించింది. తెలుగు సినిమాలు లేకపోయినా హైదరాబాద్‌ సినీ ప్రియులకి మాత్రం ఇతర భాషా చిత్రాలతో కాలక్షేపమైపోతోంది. 

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!