cloudfront

Advertisement


Home > Movies - Trade Talk

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

లాస్ట్‌ వీక్‌ మూడు సినిమాలు రిలీజ్‌ అయితే 'గూఢచారి' మాత్రం సూపర్‌ హిట్‌ అయింది. అడివి శేష్‌ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. 'క్షణం' చిత్రానికి అయిదంతలు ఎక్కువ బడ్జెట్‌ అయినా కానీ కేవలం అయిదే రోజుల్లో లాభాల్లోకి అడుగు పెట్టిన 'గూఢచారి' ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్‌ అవుతోంది.

అంచనాలు రేకెత్తించిన చి||ల||సౌ|| మాత్రం బాక్సాఫీస్‌ వద్ద కనీస ప్రభావం చూపించలేకపోయింది. ఈ చిత్రం ఏ సెంటర్స్‌లో కూడా సక్సెస్‌ కాలేకపోయింది. ఇక బ్రాండ్‌ బాబు అయితే అసలు నోటీస్‌ చేసేవారే లేకుండాపోయింది. ఇక సాక్ష్యం చిత్రం సెకండ్‌ వీకెండ్‌లో కూడా పికప్‌ కాలేక ఫైనల్‌గా పెద్ద ఫ్లాప్‌ అనిపించుకుంది.

శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఆశించిన ఆదరణ తొలిరోజు అయితే దక్కలేదు. టాక్‌ వీక్‌గా వుంది కనుక ఈ చిత్రం పుంజుకోగలదని ట్రేడ్‌ విశ్వసించడం లేదు. ఈ చిత్రంపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఎందుకో ఈసారి దిల్‌ రాజు మ్యాజిక్‌ పని చేయలేదు.