టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో ప్రవేశించి సక్సెస్‌ఫుల్ నటుడిగా రాణించారు.
టాలీవుడ్ మన్మథుడిగా నాగార్జున పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన హీరో మరోసారి ఏడడుగులు నడవనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో సుమంత్ పెళ్లి కొడుకు కానున్నారు. అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
త్వరలో పవిత్ర మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించేందుకు నిర్ణయించారు. సుమంత్-పవిత్రల పెళ్లిపత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా గతంలో హీరోయిన్ కీర్తిరెడ్డితో సుమంత్‌కు వివాహమైన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. లండన్లో స్థిరపడ్డ ప్రముఖ వైద్యుడు కార్తీక్ ను హీరోయిన్ కీర్తిరెడ్డి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
సుమంత్ మాత్రం గత కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా పెళ్లి నిశ్చయంతో అక్కినేని అభిమానుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.