Advertisement

Advertisement


Home > Politics - Analysis

కాంగ్రెస్ అందరిదీ.. రేవంత్ అందరివాడు

కాంగ్రెస్ అందరిదీ.. రేవంత్ అందరివాడు

అపజయం అనాధ అని విజయానికి బంధువులు ఎక్కువ ఊరికనే అనలేదు పెద్దలు. నిన్న మొన్నటి వరకు కేటిఆర్‌తో, సంతోష్‌తో, తెలంగాణ మంత్రులతో చెట్టపట్టాలు వేసుకున్నవారు, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమ అనుబంధాలను నెమరు వేసుకుంటున్నారు. ఎన్నికల టైమ్ లో సైలంట్ గా వెళ్లి కలిసి వచ్చిన వారు వున్నారు, ఎన్నికల తరువాత కలిసిన వారు వున్నారు. ఇప్పుడు ఎవరైనా కదలేస్తే తమకు ఎంతటి ఆప్తుడో, ఎలా ఆప్తుడో, ఎక్కడ పరిచయమో చెబుతున్నారు ఇండస్ట్రీ జనాలు.

తమతో పనిచేసిన అనుభవం అని కొందరు పలవరిస్తున్నారు. తమతో క్లబ్ పరిచయం అని కొందరు నెమరువేసుకుంటున్నారు. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి లేదా రేవంత్ కు, కాదంటే కాంగ్రెస్ నాయకులకు సీదాగా మద్దతు పలికిన వారు ఎవరున్నారు టాలీవుడ్ లో? కేటిఆర్ గెలిచినా మన నేస్తమే, రేవంత్ గెలిచినా మన దోస్త్ నే కదా అని గోడ మీద వుండిపోయిన వారే ఎక్కువ.

నిజానికి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. బండ్ల గణేష్ ను జనం కమెడియన్ గా చూసినా, కాంగ్రెస్ ను అంటి పెట్టుకునే వున్నాడు. గతంలో సెవెనో క్లాక్ బ్లేడ్ అని ట్రోల్ చేసినా, మళ్లీ ఫలానా రోజు ప్రమాణస్వీకారం, ముందు రోజు నుంచి గ్రవుండ్ లోనే వుంటా అంటూ హల్ చల్ చేసాడు. అలాగే చాలా మంది అభ్యర్ధుల తరపున ప్రచారం సాగించాడు.

పూనమ్ కౌర్ కొన్నాళ్ల క్రితం రాహుల్ గాంధీకి నేరుగా మద్దతు పలికారు. పాదయాత్రలో చేయి చేయి కలిపి నడిచారు. అప్పుడు దాన్ని కూడా ట్రోల్ చేసిన వారు వున్నారు. కానీ ఆమె ఏమీ తగ్గలేదు. సోషల్ మీడియాలో వీలయినపుడల్లా ప్రో కాంగ్రెస్ ట్వీట్ లు వేస్తూనే వచ్చారు.

కానీ ఇకపై చూడాలి. ఇండస్ట్రీ జనాలు ఎలాంటి హడావుడి చేస్తారో? ఇప్పటికే అరవింద్ ఇండస్ట్రీకి గతంలో మంచి చేసిన ప్రభుత్వం, భవిష్యత్ చేసే ప్రభుత్వం అని బంధాలు వేసేసారు. రేవంత్ కు ఇండస్ట్రీ జనాల నుంచి శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. 

ఇలా చెబుతున్న వారిలో చాలా మంది నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన వారు, నెరుపుతున్నవారే. మామూలుగా శుభాకాంక్షలు చెప్పడం అన్నది జస్ట్ ఓ ఫార్మాలిటీ అని అనుకోవచ్చు. అంతకు ముందుకు అడుగేసి హఢావుడి చేసే ప్రయత్నాలు చేస్తున్నవారిని చూస్తేనే అనిపిస్తుంది.. విజయానికి తండ్రులు ఎక్కువ అని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?