Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఈనాడు పాచి పాట.. బాబుది వంత పాట!

ఈనాడు పాచి పాట.. బాబుది వంత పాట!

అండర్ గార్మెంట్స్ తయారుచేసే జాకీ సంస్థ, అధికార పార్టీ ఎమ్మెల్యే అడిగిన ముడుపులు ఇవ్వలేక ఖాళీచేసి వెళ్లిపోయిందనేది.. ఈనాడు కథనం. వారు అలా ప్రచురించిన వెంటనే వంత పాడడానికి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉంటారు. ఎవ్వరూ బుర్ర పెట్టి ఆలోచించరు. ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? లాంటి వివరాల జోలికి వెళ్లరు. 

వైసీపీ ఎమ్మెల్యే దందా వల్ల పరిశ్రమ వెళ్లిపోయింది అనే ప్రచారంలోనే కడతేరిపోతుంటారు. ఈ పచ్చముఠా ప్రచారాలు ఎలా నడుస్తున్నాయంటే.. చంద్రబాబునాయుడే.. ఈనాడుకు లీకులు ఇస్తారు. ఆధారాలన్నీ ఏర్పాటుచేస్తారు. వారు వార్త రూపంలో ప్రచురిస్తారు. ఆ తర్వాత.. ఆ కటింగ్ పట్టుకుని.. ఘోరం జరిగిపోతున్నట్టుగా చంద్రబాబు వంతపాడుతుంటారు.

ఇప్పుడు వాస్తవాలు చూద్దాం.. 

జాకీ అనే సంస్థ వైసీపీ ఎమ్మెల్యే దందా వలన వెళ్లిపోయిందనే అనుకుందాం. ఈనాడు వార్త నిజమే అనుకుందాం. అయితే ఆ సంగతి 2019 డిసెంబరు లో జరిగింది. మరి మూడు సంవత్సరాల పాటు ఈ అరాచకాన్ని ప్రశ్నించకుండా ఈనాడు ఏం చేస్తోంది. గుడ్డి గుర్రానికి పళ్లు తోముతోందా? మేం స్థలం ఇచ్చేస్తాం అని జాకీ సంస్థ ప్రభుత్వానికి రాసినప్పుడే.. వారు ఈ కథనం వెలికి తెచ్చి ఉంటే.. కనీసం ప్రభుత్వం తప్పు తమ మీద పడుతుందని భయపడి, ఆ పరిస్థితిని చక్కదిద్ది ఉండేదేమో. కానీ.. కేవలం వైసీపీ మీద నిందలు వేయడానికి తప్ప.. మరో ప్రయోజనం లేని రీతిలో.. మూడేళ్ల పాటు కళ్లు మూసుకుని ఇప్పుడు ఈనాడు ఆ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. 

ఎందుకిలా చేశారో ఆలోచిస్తే.. అసలు మర్మం బోధపడుతుంది. 

జాకీ సంస్థకు 2017 నవంబరులోనే చంద్రబాబునాయుడు ప్రభుత్వం 28 ఎకరాలు యూనిట్ ఏర్పాటుకు కేటాయించింది. వారికి స్థలం కేటాయిస్తున్న సంగతి అప్పటి ప్రభుత్వంలోని పెద్దలకు ముందుగానే తెలుసు గనుక.. ఆ చుట్టపక్కల భూములన్నీ కారుచౌకగా కొని నిల్వ చేసుకున్నారు. తీరా ఎకరా పది లక్షల వంతున జాకీ సంస్థకు చంద్రబాబు సర్కారు భూములు ఇచ్చింది. అది జరిగిన ఏడాదిన్నర తరవాత.. జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. మరి అప్పటిదాకా యూనిట్ ఎందుకు ఏర్పాటు కాలేదు. పనులు ఎందుకు మొదలు కాలేదు. 

ఇదంతా అప్పటి తెలుగుదేశం స్థానిక నాయకుల దందాల వల్ల. కారుచౌకగా భూములు ఇప్పించాం.. మాకు కమిషన్లు ముట్టవలసిందే.. అంటూ జాకీ మీద తెదేపా నేతలు ఒత్తిడి తేవడంతో వారు భయపడి ఆగిపోయారు. ఈలోగా మరోవైపు జాకీ సంస్థ వచ్చేస్తోంది అనే ప్రచారంతో.. తెదేపా వారంతా తాము రియల్ ఎస్టేట్ పెట్టుబడులుగా కొన్నట్టువంటి భూములను విపరీతంగా రేట్లు పెంచి అమ్ముకోవడం సాగించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. కారుచౌకగా స్థలాలు తీసుకుని.. యూనిట్లు ప్రారంభించకుండా రియల్ దందాలు నడిపించాలనుకునే వారిని ఉపేక్షించేది లేదని జగన్ సర్కారు తేల్చి చెప్పింది. జాకీ అప్పటిదాకా చేసిందేమీ లేదు. నిజానికి టీడీపీ వారు చేయనివ్వలేదు. 

జాకీకి మళ్లీ టీడీపీ వారి ఒత్తిడులే మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జాకీ సంస్థకు ముడిపెట్టి ఆందోళనలు చేస్తామనే హెచ్చరికలు వచ్చాయి. వీటికి విసిగిపోయి వారు స్థలాల్ని తిరిగి ఇచ్చేశారు. అయితే ఆ వ్యవహారాన్ని వైసీపీ నేతల దందాకు ముడిపెట్ట మూడేళ్లు ఆగి వార్తాకథనాలు ఇవ్వడం వెనుక మర్మం ఏంటంటే.. టీడీపీ వారి రియల్ ఎస్టేట్ దందా. జాకీ చుట్టుపక్కల తాము కొన్న స్థలాలన్నీ పూర్తిగా భారీ ధరలకు, లాభాలకు అమ్ముకునేదాకా వారు ఆగారు.

జాకీ ఉన్నదనే భ్రమల్లో కొనుగోలుదారుల్ని పెట్టి, అన్నీ అమ్మేసిన తర్వాత.. అసలిక్కడ జాకీ ఉండడం లేదని సంగతి బయటకు తెచ్చారు. వారు ఇచ్చిన ఆధారాలతో ఈనాడు ఓ కథను వండి వార్చింది. చంద్రబాబునాయుడు ఇప్పుడు దానికి వంత పాడుతున్నారు. చేసిందంతా చేసి.. వైసీపీ మీద బురద చల్లడానికి పచ్చముఠా మొత్తం ప్రయత్నిస్తున్నారు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా