Advertisement

Advertisement


Home > Politics - Analysis

రైతు బంధు.. రుణమాఫీ.. ఎప్పుడు?

రైతు బంధు.. రుణమాఫీ.. ఎప్పుడు?

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. నిజంగా జనాల్లో విపరీతమైన ఆదరణ సంపాదించిపెట్టే హామీ. కానీ కాస్త పద్దతిగా ప్లాన్ చేస్తే ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. ఎందుకంటే ఇప్పటికి వున్న లెక్కల ప్రకారం మహిళా ప్రయాణీకుల వల్ల ఎంత ఆదాయం వస్తోందో అంత ప్రభుత్వం వెనక్కు ఇస్తే సరిపోతుంది. లేదూ అంటే భవిష్యత్ లో ఆ మేరకు కొద్దిగా చార్జీలు పెంచినా సరిపోతుంది. ఇక ఇలా ఫ్రీ అనడం వల్ల ఎందరు అదనంగా ఎక్కినా, ఆర్టీసీకి పొయ్యేదేమీ లేదు. అదే బస్.. అదే డ్రైవర్.. అదే ఇంధనం.

కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే పల్లె వెలుగులు, ఎక్స్ ప్రెస్ లు లిమిటెడ్ గా వుంచి మిగిలిన తరహా బస్ లు పెంచితేనే. ప్రస్తుతానికి అయితే అలాంటి పనులు చేయరు. పండగ సీజన్లో చేసే అవకాశం వుంది. సరే, ఆ సంగతి అలా వుంచితే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇబ్బంది పెట్టే హామీలు రెండు. రైతు బంధు..రుణమాఫీ. ఇప్పటికిప్పుడు చేయాల్సినవి కూడా ఇవే.

ఆర్థిక ఇబ్బందులు వున్న మాట వాస్తవం. ఇప్పుడు రుణాలు తేవాల్సిందే. వన్స్ రుణాలు తేవడం మొదలుపెడితే మీడియా వార్తలు వండుతూనే వుంటుంది. ఆ సంగతి అలా వుంచితే, ఉచిత బస్ ప్రయాణాన్ని తెలంగాణ జనాలకు, అలాగే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లకు పరిమితం చేసారు. ఎన్నికలకు ముందు అలా అనలేదు. ఇతర రాష్ట్రాల మహిళలకు ఫ్రీ అన్నారు. అన్ని బస్ లకు ఫ్రీ అన్నారు. ఇప్పుడు మాట మార్చారు.

రైతు బంధుకు కూడా ఇలాగే మెలిక పెట్టే ఆలోచన చేస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఇప్పుడు ఇన్ కమ్ టాక్స్, ఎంత విస్తీర్ణం అన్న లిమిట్ లేకుండా రైతు బంధు ఇస్తూ వస్తున్నారు. కానీ ఆంధ్రలో అలా కాదు. ఇన్ కమ్ టాక్స్ పే చేసేవారికి రైతు భరోసా అందదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అలా కాకున్నా కొన్ని నిబంధనలు తెచ్చే అవకాశం వుంది. ముఖ్యంగా అయిదు ఎకరాలకు మించి వుంటే రైతు బంధు ఇవ్వకుండా అవకాశం వుంది. డబ్బు వున్న వారికి ఎందుకు ఇవ్వడం అనే పాయింట్ తో విమర్శలు తిప్పి కొట్టచ్చు.

అలాగే రుణమాఫీ విషయంలో ఏం చేస్తారో? ఇంత కాలపరిమితి తీరిన రుణాలు అంటారో? ఇంకేమైనా మెలిక పెడతారో చూడాలి. ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు రకాల ఇబ్బందులు. అమలు చేయకపోతే జనాలతో.. మెలికలు ఏమైనా పెడితే ప్రతిపక్షంతో. ఇలాగే అయిదేళ్లు నెగ్గుకు రావాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?