Advertisement

Advertisement


Home > Politics - Analysis

వేవ్ వచ్చింది.. కానీ అటా? ఇటా?

వేవ్ వచ్చింది.. కానీ అటా? ఇటా?

ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ లో వేవ్ వచ్చిందన్న క్లారిటీ వచ్చేసింది. పోలింగ్ దాదాపు 70 నుంచి 80 శాతం వుంటుందని అంచనాలు వస్తున్నాయి. పోలింగ్ రాత్రి ఎనిమిది గంటల వరకు చాలా నియోజకవర్గాల్లో జరుగుతుందని తెలుస్తోంది. ఇంతటి పోలింగ్ అంటే వేవ్ అన్నది క్లారిటీనే. కానీ ఆ వేవ్ ఎటు అన్నది మాత్రం ఇంకా మరింత క్లారిటీ రావాల్సి వుంది.

జనసేన పోటీ చేసిన దగ్గర వేవ్ ఆ పార్టీకే అనుకూలంగా వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన చోట్ల ఎలా వుంది అన్నది ఈ రాత్రికి లేదా రేపు ఉదయానికి తెలియవచ్చు. ఏమైనా ఈ వేవ్ కు జనసేన చాలా వరకు కారణమన్నది ఓ పాయింట్. డబ్బులు అన్ని వైపుల నుంచి భారీగా ఖర్చు చేయడం కూడా ఈ వేవ్ కు ఓ కారణం.

అయితే డబ్బులు తీసుకున్నవారంతా నిబద్దతతో ఓటు వేసారని చెప్పలేం. ఎందుకంటే రెండు వైపుల నుంచి డబ్బులు తీసుకున్న ఓటర్లు ఇద్దరికీ ఓటు వేయలేరు కదా. అందువల్ల ఎవరో ఒకరి వైపే మొగ్గాల్సి వుంటుంది. అది కూటమి వైపా, వైకాపా వైపా అన్నది తెలియాలి. అందుతున్న వార్తలను వింటే మాత్రం ఆంధ్రలో కూటమి వేవ్ వుందనే గట్టిగా వినిపిస్తోంది. కానీ మహిళలు, బడుగు వర్గాలు, మైనారిటీలు కూడా ఎక్కువ సంఖ్యలో క్యూలలో కనిపించారు కనుక వైకాపా ఆశలు కూడా ఇంకా సజీవంగా వున్నాయి. కానీ ముందే చెప్పుకున్నట్లు జనసేన పోటీ చేసిన చోట్ల మాత్రం ఈ ఆశలు కనిపించడం లేదు.

తిరుపతి, విశాఖ సౌత్, అనకాపల్లి, నెల్లిమర్ల, పిఠాపురం ఇలాంటి చోట్ల జనసేన వైపే వేవ్ వుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రాయలసీమలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అక్కడ పెద్దగా గడబిడలు జరిగిన వార్తలు లేవు. తూర్పులో ఒకటి రెండు చోట్ల, పలనాడు ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల గట్టి గొడవలు జరిగాయి. అందువల్ల రాయలసీమలో వైకాపాకు ఎన్ని వస్తాయి అన్నది చూడాల్సి వుంది.

మొత్తం మీద అయితే విజయవాడ నుంచి ఇచ్ఛాపురం వరకు మంచి వేవ్ కనిపిస్తోంది. అది ఎటు వైపు వుంటే అటు అధికారం అందే అవకాశం వుందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఆ లెక్కన చూసుకుంటే విజయనగరం, విశాఖ సిటీ, తూర్పు గోదావరి జిల్లాల్లో కూటమి హవా గట్టిగా కనిపిస్తోందని ప్రాధమికంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద వేవ్ వుంది. అది ఓ పాయింట్.

చాలా వరకు అది కూటమికి అనుకూలంగా వుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది రెండో పాయింట్.

కరెక్ట్ గా ఈ వేవ్ ఎటు వుందన్నది లోపాయికారీగా అయినా ఎగ్జిట్ పోల్స్ వస్తే తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?