Advertisement

Advertisement


Home > Politics - Analysis

రేవంత్‌రెడ్డికి శ‌త్రువుల్ని పెంచుతున్న ఎల్లో మీడియా!

రేవంత్‌రెడ్డికి శ‌త్రువుల్ని పెంచుతున్న ఎల్లో మీడియా!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులే త‌ప్ప‌, శ‌త్రువులు వుండ‌ర‌ని అంటుంటారు. వేర్వేరు పార్టీల‌కు సంబంధించిన నేత‌లు ప‌ర‌స్ప‌రం ప్ర‌త్య‌ర్థులుగా భావిస్తుంటారు. ఒకే పార్టీలో వుంటూ, ఒకరికొక‌రు వ్య‌తిరేకించుకునే వారిని శ‌త్రువులుగా భావించాల్సి వుంటుంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి అనేక కార‌ణాలున్నాయి. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాల‌న్న‌ట్టు, బీఆర్ఎస్ ఓట‌మికి ఎన్నో ప్ర‌తికూల‌తలు తోడ‌య్యాయి.

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి కేవ‌లం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వ‌మే కార‌ణ‌మ‌ని టీడీపీ అనుకూల మీడియా భారీ ప్ర‌చారం చేస్తోంది. ఈ ప్ర‌చారం వెనుక ఎవ‌రి రాజ‌కీయ‌, ఆర్థిక ప్ర‌యోజ‌నాలు దాగి వున్నాయో అర్థం చేసుకోలేనంత అమాయ‌క‌త్వంలో రెండు తెలుగు స‌మాజాలు లేవ‌ని గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది. సీఎం అభ్య‌ర్థిగా రేవంత్‌రెడ్డి కేంద్రంగా ఎల్లో మీడియా గేమ్ మొద‌లు పెట్టింది.

రేవంత్‌రెడ్డిలో ప‌సుపు ర‌క్తం ప్ర‌వ‌హిస్తుంద‌ని, అత‌నైతే ఇటు టీడీపీ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తార‌ని చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోసేవారంతా న‌మ్ముతున్నారు. రేవంత్‌రెడ్డి భ‌జ‌న శ్రుతిమించుతోంది. ఇదే వ్య‌క్తిగ‌తంగా రేవంత్‌రెడ్డికి తీవ్ర న‌ష్టం తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌లో ఎవ‌రు ముఖ్యమంత్రి అయినా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. త‌మ‌కు అధికారం పోయిన త‌ర్వాత ఎవ‌రైతే త‌మ‌కేంటి? అనే భావ‌న‌లో బీఆర్ఎస్ నేత‌లున్నారు. బీజేపీ ఆలోచ‌న కూడా ఇంతే.

అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన అంశం... కాంగ్రెస్‌కు వ‌చ్చిన సీట్లు 64, ఆ పార్టీ బ‌ల‌ప‌రిచిన సీపీఐకి ఒక‌టి. మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే కాంగ్రెస్‌కు ఐదు సీట్లు మాత్ర‌మే అధికంగా ఉన్నాయి. ఇదేం అద్భుతం కాద‌నే సంగ‌తిని గుర్తించుకుని కాంగ్రెస్ మెల‌గాల్సి వుంటుంది. ఇంకా సీఎల్పీ లీడ‌ర్‌ను ఎన్నుకోక ముందే రేవంత్‌రెడ్డిని ఏకంగా సీఎంగా ఎల్లో మీడియా కుర్చీలో కూచోపెట్టింది. ఈ  ప‌రిణామాల‌ను కాంగ్రెస్‌లోని ముఖ్య‌నేత‌లు గ‌మ‌నిస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతున్న‌దో కూడా కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ ప‌రిణామాలు రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌లో శ‌త్రువుల్ని పెంచ‌డం త‌ప్ప‌, ఆయ‌న‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంచి చేయ‌వ‌ని తెలిసి కూడా, ఎల్లో మీడియా అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా ఉండ‌లేదు. రేవంత్‌రెడ్డిపై చంద్ర‌బాబు ముద్ర వేసి, త‌ద్వారా రాజ‌కీయంగా కాంగ్రెస్‌కు, అలాగే రేవంత్‌కు భారీ న‌ష్టం క‌లిగించ‌డానికి శ‌త్రువుల‌తో ప‌ని లేకుండా, ఎల్లో మీడియానే చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది.

స‌హ‌జంగానే కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలంగా ఉన్న త‌మ‌ను కాద‌ని రేవంత్‌రెడ్డికి సీఎం ప‌ద‌వి క‌ట్ట‌డెట్ట‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేరు. అయితే రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వం కాంగ్రెస్‌కు ఊపు తెచ్చింద‌నే వాస్త‌వాన్ని ఎవ‌రూ కొట్టి పారేయ‌లేరు. కానీ కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్య‌ర్థిని ఎన్నుకునే వ‌ర‌కూ ఓపిక లేక‌పోతే ఎట్లా? ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా సీఎం అభ్య‌ర్థిని ఎన్నిక ప్ర‌క్రియ కొన‌సాగితే, అంద‌రినీ సంతృప్తి ప‌రిచిన‌ట్టు అవుతుంద‌ని కాంగ్రెస్ ఆలోచ‌న‌.

అయితే ఈ లోపే కొంప‌లు మునిగిపోతాయ‌న్న‌ట్టు ... ఇదిగో , అదిగో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్ర‌మాణం అంటూ ... ఎవ‌రిదో పెళ్లి అవుతుంటే కుక్క‌ల హ‌డావుడి అన్న చందంగా ఎల్లో మీడియా నానాయాగీ చేస్తోంది. రేవంత్‌పై ఈ ర‌క‌మైన ఓవ‌రాక్ష‌న్ చేస్తే, భ‌విష్య‌త్‌లో ఆయ‌న‌కు కోలుకోలేని న‌ష్టం చేసిన వారిగా టీడీపీ నేత‌లు, ఆ పార్టీ అనుకూల మీడియా య‌జమానులు మిగిలిపోతారు. వీళ్ల విష‌యంలో అతి జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది రేవంత్‌రెడ్డినే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?