వీర‌య్య చౌద‌రి హ‌త్య‌పై జ‌న‌సేన మౌనం!

పూర్తిగా వ్యాపార లావాదేవీల వ్య‌వ‌హారాల్లో త‌లెత్తిన విభేదాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటున్నారు.

మాజీ ఎంపీపీ, టీడీపీ నాయ‌కుడు ముప్ప‌వ‌ర‌పు వీర‌య్య చౌద‌రి హ‌త్య రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఒంగోలులో ఆయ‌న కార్యాల‌యానికి వెళ్లి మ‌రీ దుండ‌గులు కిరాత‌కంగా చంపారు. టీడీపీ పెద్ద‌లైన సీఎం చంద్ర‌బాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు వీర‌య్య చౌద‌రి స‌న్నిహితుడ‌నే పేరు పొందారు. రాజ‌కీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్న క్ర‌మంలో హ‌త్య‌కు గురి కావ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

అయితే హ‌త్య‌పై ఇంత వ‌ర‌కూ జ‌న‌సేన నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ముఖ్యంగా ఒంగోలు జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఈ విష‌య‌మై నోరెత్త‌లేదు. భాగ‌స్వామ్య ప‌క్ష నాయ‌కుడు హ‌త్య‌కు గురైతే, క‌నీసం చూడ‌డానికి కూడా జ‌న‌సేన నేత‌లెవ‌రూ వెళ్లిన‌ట్టు వార్త‌లు రాలేదు. దీన్నిబ‌ట్టి వీర‌య్య చౌద‌రి హ‌త్య‌ను జ‌న‌సేన చూసే దృష్టి వేరేగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూర్తిగా వ్యాపార లావాదేవీల వ్య‌వ‌హారాల్లో త‌లెత్తిన విభేదాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటున్నారు. అందుకే వీర‌య్య చౌద‌రి హ‌త్య‌పై జ‌న‌సేన మౌనం పాటించ‌డం ద్వారా, కాలానికి అన్నీ వ‌దిలేసిన‌ట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంది. వీర‌య్య చౌద‌రి అంత్య‌క్రియ‌లు ఆయ‌న స్వ‌గ్రామం అమ్మ‌న‌బ్రోలులో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ప‌లువురు మంత్రులు హాజ‌ర‌య్యారు.

కానీ జ‌న‌సేన నుంచి చెప్పుకోద‌గ్గ నాయ‌కులెవ‌రూ హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీర‌య్య చౌద‌రిని రాజ‌కీయంగా సొంత పార్టీలోనూ, అలాగే జ‌న‌సేన‌లోనూ వ్య‌తిరేకించే వాళ్లు కూడా ఉన్నార‌ని ఈ ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. హ‌త్య‌ను పోలీసులు ఛేదిస్తే, వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలిసే అవ‌కాశం వుంది. ప్ర‌స్తుతం పోలీసులు అదే ప‌నిలో ఉన్నారు.

8 Replies to “వీర‌య్య చౌద‌రి హ‌త్య‌పై జ‌న‌సేన మౌనం!”

  1. ఒక పక్క దేశం పాకిస్తాన్ తో తాడో పేడో తేల్చుకునే పరిస్థితిలో ఉంది…. ఈ సమయంలో వీరయ్య చౌదరి హత్యకి స్పందన లేదు, కర్మ కాండ కి హాజరు అయి కన్నీళ్లు పెట్టలేదు, ఏమిటో ఈ కంప్లైంట్స్…. ఆయన ఎంపీపీ ఆండీ, మండల్ ప్రజా పరిషద్ స్థాయి…. చంద్ర బాబు స్పందించారు తన సొంత పార్టీ కాబట్టి…. జనసేన ఎందుకు స్పందించాలి…. ఏమి పని జనసేనకీ? హాజరు కాకపోతే వ్యతిరేంచినట్లా….

  2. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

  3. రాజకీయం చేయడానికి ఆంధ్రాలో ఉన్నది kcr, ktr, మోడీ, సోనియా గాంధీ కాదు!

    ఒక కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది, ఒక నియంత, ఒక మూర్కుడు , జగన్.

    ని వీరయ్య లాగా ప్రతీ నెలా ఒక కార్యకర్త హత్య గురవుతున్నారు… ఈరోజు వీరయ్య, రేపు నేను, ఎల్లుండి ఇంకొకరూ, మొత్తం 5 యెల్లలో టిడిపి కార్యకర్తలు ఎవరూ ఉండరు టీడీపీ ఇలానే రాజకీయాలు చేస్తుంటే!

    అసలు గవర్నమెంట్ వచ్చిన కాడినుంచి వై చీపి ప్రతీ నెలా ఒకటో, రెండో కార్యకర్తల పై హత్యలు జరుగుతున్నాయి.. ప్రతీ వారంఏదో ఒక అపనింద , తప్పుడు వార్తలు చేస్తుంది, చేయిస్తుంది…. వై చీపి గవర్నమెంట్ ఉన్నపుడు అరాచకం చేసిన గూండాలు, రౌడీల లాంటి వాళ్ళని పట్టుకుని , పాత కేసులు ఓపెన్ చేసి అదుపులోకి తీసుకుని ఉంటే ఈ రోజు ప్రతీ నెలకు ఒక కార్యకర్త బలి అయ్యే వాళ్ళా ? అసలు మీరు కార్యకర్తల కష్టాలు వినడం లేదు, వాళ్ళు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు ….. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గుండాలని, రౌడీలని, మావోయిస్టులును ఉక్కు పాదంతో అణిచి వేసిన మా సీబీన్ ఎక్కడ ? మీరు జగన్ ని ఎస్కోబార్ అన్నారు , ఇపుడు మర్చిపోయారా ? ఇంతమంది చనిపోయిన ఇంకా మీరు వై చీపి రౌడీలని , గూండాల ని పట్టుకుని లోపాల వేయరా ?

    ఇంకా ఎంత మంది మేము చావలీ! కనీసం మాకు చెప్పండి ఒక 3 యేళ్ళు కార్యకర్తలు ఆగండీ, మీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకండీ… చస్తే చావండీ… అని అంటే కనీసం మేము మా నాయకుడు చెప్పాడు కాబట్టి అలానే బ్రతుకు భయంతో చస్తూ బ్రతుకుతాం …

    ఎంత బాధగా ఉందో మీకు అర్థమవుతోందా?

    మన మంచి ప్రభుత్వం ఉన్నా కాని దోషులను, రౌడీ లను పట్టుకోలే ని దద్దమ్మ గవర్నమెంట్ అని పించకోవాలని అనుకుంటున్నారా?

Comments are closed.