జీవీఎంసీలో వైసీపీ మేయర్ మీద కూటమి నేతలు అవిశ్వాసం పెట్టడం కాదు కానీ కొందరికి అది రాజకీయంగా కలసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి అవసరాలను ఎరిగి మరీ దగ్గరుండి ఓటేసి వైసీపీ మేయర్ ని దించేసిన వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఒకటి ఉందని అంటున్నారు.
దాంతో బొటా బొటీగా మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసి మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకున్నందుకు ప్రతి ఉపకారం చేసి తీరాల్సిన ఆగత్యమూ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వైపు చాలా కాలంగా చూస్తున్న వారికి తలుపుకు తెరచుకునే అవకాశాలు అధికం అయ్యాయని అంటున్నారు.
విశాఖలో మాజీ వైసీపీ నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు. ఆయన 2014 నుంచి 2019 మధ్య టీడీపీలో ఉన్న వారే. అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసిన వారే. ఆయన తిరిగి టీడీపీలో చేరాలని చూస్తున్నారు. ఆయన వైసీపీని వీడడం వెనక సైకిలెక్కాలన్న కోరిక బలంగా ఉందని గతంలో ప్రచారం సాగింది.
దానికి భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అభ్యంతరం చెప్పారని అంటున్నారు. ఇపుడు చూస్తే పరిస్థితి మారింది. నాలుగు దశాబ్దాల టీడీపీ కలను మేయర్ రూపంలో అందించడంలో అవంతి కుమార్తె తన వంతుగా ఓటేసి సహకరించారు. దాంతో అవంతి శ్రీనివాసరావు టీడీపీలోకి రావడానికి మార్గం సుగమం అయింది అని అంటున్నారు.
సాధ్యమైనంత తొందరలోనే అవంతికి పసుపు పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు. భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతికి స్థానికంగా బలం ఉంది. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో పాటుగా అర్ధబలమూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారని దానికి పెద్దలు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు.
చిన్నోడి గంట టైంపాస్ కి గంట , అరగంట టైంపాస్ కి అవంతి. రెడ్ బుక్ ఆ రెడ్ బం ఆ.
maripudu ganta araganta antaara?
ఇలాంటి జంపింగ్ జపాంగ్ లని తీసుకోవటం వేస్ట్..
అంత బలం వుంటే 90000 కి పైగా తేడాతో ఎందుకు ఓడిపోయాడు.. తిక్క రేగితే కులం లేదు..బలం లేదు..ఎవడికైనా కర్రు కాల్చి వాతలు పెడతారు జనం.
what is your problem GA GARU SOOOOOOO INDEEEEEEEPENDENT
Lucky person. He got top priority in both parties….

తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!
ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?
గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.
తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?
పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.
ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!
ఒరేయి నీ స్వంత పేరు కూడా చెప్పుకోలేని సన్నాసి ఎందుకురా గ్రామ సింహం అరుపులు