వీర‌య్య చౌద‌రి హ‌త్య ఛేద‌న‌.. ఓ స‌వాల్‌!

క‌నీసం చిన్న క్లూ కూడా దొరక్క‌పోవ‌డంతో పోలీసుల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది.

ఒంగోలు టీడీపీ నాయ‌కుడు ముప్ప‌వ‌ర‌పు వీర‌య్య చౌద‌రి హ‌త్య కేసు మిస్ట‌రీగా మారింది. హ‌త్య జ‌రిగి మూడు రోజుల‌వుతున్నా, ఇంత వ‌ర‌కూ ఎలాంటి ఆన‌వాళ్ల‌ను పోలీసులు తెలుసుకోలేక‌పోయారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మైన పుటేజీని ప‌రిశీలించినా, ఎలాంటి క్లూ దొర‌క‌లేద‌ని పోలీసులు అంటున్నారు. దుండ‌గులు ముసుగులు ధ‌రించి వుండ‌డంతో పాటు చీక‌ట్లో ద్విచ‌క్ర వాహ‌నాల నెంబ‌ర్ల‌ను కూడా గుర్తించ‌లేని విధంగా చిత్రాలున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

మ‌రోవైపు అనేక కోణాల్లో పోలీసులు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. రేష‌న్ బియ్యం మాఫియాకు సంబంధించిన ఓ వ్య‌క్తిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అలాగే అత‌ని అనుచ‌రుల్ని కూడా అదుపులోకి విచారించిన‌ప్ప‌టికీ, హ‌త్య‌కు సంబంధించి ఎలాంటి వివ‌రాలు సేక‌రించ‌లేక‌పోయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో రేష‌న్ బియ్యం మాఫియా చేసిన హ‌త్య కాద‌నే నిర్ధార‌ణ‌కు అన‌ధికారికంగా పోలీసులు వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ముఖ్యంగా రామాయ‌ప‌ట్నం స‌మీపంలో వీర‌య్య చౌద‌రి కొనుగోలు చేసిన 100 ఎక‌రాల‌కు సంబంధించి భూవివాద‌మే హ‌త్య‌కు దారి తీసి వుంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు. విశాఖ‌, హైద‌రాబాద్‌లో కూడా వీర‌య్య చౌద‌రి ల్యాండ్ సెటిల్‌మెంట్స్ చేసిన‌ట్టు పోలీసులకు స‌మాచారం వుంది.

ఆ దిశ‌గా కూడా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతానికైతే హ‌త్య కేసు నిందితులెవ‌రు? ఎందుకు చేసి వుంటార‌నే అంశాల‌పై స్ప‌ష్ట‌త రాలేదు. అంతేకాదు, క‌నీసం చిన్న క్లూ కూడా దొరక్క‌పోవ‌డంతో పోలీసుల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది.

7 Replies to “వీర‌య్య చౌద‌రి హ‌త్య ఛేద‌న‌.. ఓ స‌వాల్‌!”

  1. క్లూ దరకలెదు అనగానె… చిన్నగా సెంటిల్మెంటు, భూ వివాదాలు అంటూ కదలు అళ్ళటం మొదలు పెట్టారు! 

  2. వీళ్ళని శత్రు దేశాలకి పంపిస్తే ఉగ్రవాదులను సైలెంట్ గా ఏసేస్తారు

  3. వివేకా సార్ కేసుకే ఇంతవరకు సాక్ష్యాలు లేవు, మొన్న జరిగిన కేసుకు సాక్ష్యాలు కావాలంటే ఎలా GA సార్.. మరీ అత్యాశ కాకపోతేను

  4. Emundi edo aardika lavadevilu teda kotti untay.. 100 acres konatam ante maamlon vishayam kaduga.. Alage settlements lantivi chesi unte.. Alanti settlements ke bali avtaru.. 

Comments are closed.