చందనోత్సవానికి చంద్రబాబు.. అధికారులకు టెన్షన్

అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవం అంటేనే భక్తులతో రద్దీగా ఉంటుంది.

విశాఖలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో చందనోత్సవం ఈ నెల 30న నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా వైశాఖంలో వచ్చే తదియ నాడు స్వామి వారు నిజరూప దర్శనం ఇస్తారు. భక్తులకు అలా కనిపిస్తారు.

నిత్యం చందనంతో ఉండే స్వామీజీ ఆ రోజున మాత్రం భక్తులకు తన అసలు రూపంతో ఆశీర్వదిస్తారు. ఇది తరాలుగా వస్తున్న సంప్రదాయం. చందనోత్సవం సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు అందించి పూసపాటి రాజవంశీకులు తొలి దర్శనం చేసుకుంటారు. వారు ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటున్నారు. అందుకే ఆ సంప్రదాయం ఉంది.

ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి అయినా లేక జిల్లా మంత్రి అయినా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు. ఆయన స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అని అంటున్నారు.

దాంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవం అంటేనే భక్తులతో రద్దీగా ఉంటుంది. వీవీఐపీలు అంతా తొందరలో తెల్లవారుజామున దర్శనాలు చేసుకుంటే సామాన్య భక్తులకు ఆ మీదట దర్శనం చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈసారి సామాన్య భక్తులకు ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అంటున్నారు.

అయితే ముఖ్యమంత్రి ఏ వేళలో దర్శనం కోసం వస్తారో అన్నది చూసుకోవాల్సి ఉంది. ఆయన వస్తే కనుక క్యూ లైన్లు ఆపుతారు దాంతో చాలా సేపు సామాన్యులు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రితో ఈ విషయాలు చర్చించి అధికారికంగా ఆయన దర్శనం సమయాన్ని ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అంటున్నారు.

2 Replies to “చందనోత్సవానికి చంద్రబాబు.. అధికారులకు టెన్షన్”

  1. సంస్కృతి, సాంప్రదాయాలను ఎలా గౌరవించాలో చంద్రబాబు కి బాగా తెలుసు. మన జు..గ్లు..కు ఏమి చేసాడు ? పెద్దాయన అనువంశిక ధర్మ కర్తలైన అశోక్ గజపతుల వారిని ఎలా అవమానించాడో తెలుగు ప్రజలందరూ చూసారు.

Comments are closed.