శ్రీహ‌రి ఏమిటీ? కిరికిరి

చింత చ‌చ్చినా పులుపు చావ‌ని చందంగా, దారుణ ఓట‌మి మూట‌కట్టుకున్నా, ఇంకా పాత వాస‌న‌లు చీఫ్ పీఆర్వోలో వుండ‌డం గ‌మ‌నార్హం.

ఒక క‌థ‌నం విష‌య‌మై వివ‌ర‌ణ అడిగిన “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధిపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చీఫ్ పీఆర్వో పూడి శ్రీ‌హ‌రి నోటి దురుసు ప్ర‌ద‌ర్శించాడు. “మీకు ఏందిరా వివ‌ర‌ణ ఇచ్చేది. నాపై పుడంగి అంటూ వ్య‌తిరేక‌ క‌థ‌నాలు రాస్తారా” అంటూ నోరు పారేసుకున్నాడు. దీనిపైన “గ్రేట్ ఆంధ్ర ప్ర‌తినిధి” కూడా గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చాడు. వివ‌రాలిలా ఉన్నాయి..

ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేసే ఐదారుగురు జ‌ర్న‌లిస్టుల‌ను వైఎస్సార్‌సీపీకి అనుకూల‌మ‌నే రాజ‌కీయ కార‌ణాల‌తో తొల‌గించారు. ఒక్కో జ‌ర్న‌లిస్టు రూ.ల‌క్ష‌, రూ.1.50 ల‌క్ష‌లు చొప్పున నెల‌వారీ వేత‌నం తీసుకునేవాళ్లు…. ఒక్క‌సారిగా రోడ్డుమీద ప‌డ్డారు. ఉపాధి పోగొట్టుకున్న స‌ద‌రు జ‌ర్న‌లిస్టులు ఏడు నెల‌ల క్రితం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. దీంతో జ‌గ‌న్ మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉపాధి పోగొట్టుకున్న జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌తినెలా జీవ‌నానికి ఇబ్బంది లేకుండా డ‌బ్బు ఇవ్వాల‌ని త‌న ద‌గ్గ‌రి వాళ్ల‌కు సూచించారు.

ఆరు నెల‌లు గ‌డిచినా జ‌గ‌న్ ఆదేశాలు అమ‌లుకు నోచుకోలేదు. మ‌రోసారి జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుందామ‌ని ప్ర‌య‌త్నించినా, ఫ‌లితం లేకుండా పోయింది. త‌మ గోడును జ‌ర్న‌లిస్టులు “గ్రేట్ ఆంధ్ర” దృష్టికి తీసుకొచ్చారు. జ‌ర్న‌లిస్టుల ఆవేద‌న‌కు అక్ష‌ర రూపం ఇచ్చే క్ర‌మంలో, వివ‌ర‌ణ కోసం జ‌గ‌న్ చీఫ్ పీఆర్వో పూడి శ్రీ‌హ‌రికి “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధి కాల్ చేశాడు. ఫోన్‌కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు. ఆ త‌ర్వాత ఆయ‌నే “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధికి కాల్ చేశాడు.

జాతీయ మీడియా జ‌ర్న‌లిస్టులు ఉద్యోగాలు పోగొట్టుకోవ‌డం, అలాగే వాళ్ల‌కు వైఎస్ జ‌గ‌న్ భ‌రోసా ఇవ్వ‌డం, ఆరు నెల‌ల‌వుతున్నా అమ‌లుకు నోచుకోక‌పోవ‌డాన్ని చీఫ్ పీఆర్వోకు వివ‌రించాడు.

“అలాంటిదేమీ లేదు. అంతా అబ‌ద్ధం” అని శ్రీ‌హ‌రి కొట్టి పారేశాడు. ప‌క్కా స‌మాచారంతోనే అడుగుతున్నాన‌ని, త‌మ ఎండీ దృష్టికి బాధిత జ‌ర్న‌లిస్టులు తీసుకెళ్ల‌డాన్ని చీఫ్ పీఆర్వోకు “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధి వివ‌రించాడు.

“నీకు, నీ ఎండీకి ఏందిరా చెప్పేది? నా గురించి పుడంగి అని వ్య‌తిరేక క‌థ‌నాలు రాస్తావా? న్యూట్ర‌ల్‌గా రాస్తే రాయండి. లేదంటే ఏదో ఒక రాజ‌కీయ ప‌క్షం వైపు వుండండి రా. అయినా న‌న్నెందుకు అడుగుతున్నావు రా” అని నోటి దురుసు ప్ర‌ద‌ర్శించాడు.

“మా వెబ్‌సైట్‌ను ఎలా న‌డ‌పాలో నీ స‌ల‌హాలు అవ‌స‌రం లేదు . జ‌గ‌న్ చీఫ్ పీఆర్వో కాబ‌ట్టే నీకు ఫోన్ చేసి వివ‌ర‌ణ అడ‌గాల్సి వ‌స్తోంది. లేదంటే నీకు ఫోన్ చేయాల్సిన ఖ‌ర్మ ప‌ట్టిండేది కాదు” అని అత‌నిదైన సంస్కార భాష‌లోనే గ్రేట్ ఆంధ్ర ప్ర‌తినిధి కూడా దీటుగా స‌మాధానం ఇచ్చాడు.

“అస‌లు మీ గురించి ఏమ‌నుకుంటున్నార్రా. మీ అంతు చూస్తా?” అని హెచ్చ‌రించారు.

“నీ గురించి మేము అనుకోవ‌డం సంగ‌తి ప‌క్క‌న పెట్టు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర చీఫ్ పీఆర్వోగా ప‌ని చేస్తూ, అడిగిన దానికి వివ‌ర‌ణ ఇవ్వ‌కపోవ‌డ‌మే కాకుండా దూష‌ణ‌ల‌కు దిగే నువ్వేం అనుకుంటున్నావు” అని చీఫ్ పీఆర్వోకు అర్థ‌మ‌య్యే భాష‌లోనే గ్రేట్ ఆంధ్ర ప్ర‌తినిధి నిల‌దీశాడు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.

వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ద్ద చీఫ్ పీఆర్వోగా ప‌ని చేసే వ్య‌క్తికి ఎంతో ఓపిక‌, స‌హ‌నం వుండాలి. ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి. కానీ జ‌గ‌న్ చీఫ్ పీఆర్వో స్నేహంగా మెల‌గ‌డం ప‌క్క‌న పెడితే, తిట్ట‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి వాళ్ల‌ను మీడియా వ్య‌వ‌హారాలు చూసుకోడానికి నియ‌మించుకున్న జ‌గ‌న్ …వైసీపీ భ‌విష్య‌త్‌పై ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

చింత చ‌చ్చినా పులుపు చావ‌ని చందంగా, దారుణ ఓట‌మి మూట‌కట్టుకున్నా, ఇంకా పాత వాస‌న‌లు చీఫ్ పీఆర్వోలో వుండ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా లేని దుస్థితిలో కూడా వివ‌ర‌ణ కోసం ఫోన్ చేయ‌గా నీచ‌మైన భాష‌లో మాట్లాడిన పూడి శ్రీ‌హ‌రి, ఇక అధికారంలో ఉన్న‌పుడు ఎలా వ్య‌వ‌హ‌రించి వుంటాడో అనే ఊహే భ‌య‌పెడుతోంది. వినాశ‌కాలే విప‌రీత బుద్ధి అంటే ఇదే కాబోలు.

44 Replies to “శ్రీహ‌రి ఏమిటీ? కిరికిరి”

  1. మీరు ఎలా మీడియా సోదరులతో మాట్లాడుతారో శ్రీహరి గారు ఎలా మీడియా సోదరులతో మాట్లాడుతారో అందరికీ తెలుసు అయ్య బాబు ఒకసారి మీడియా మిత్రులను అడగండి

  2. దురుసుగా ఎందుకు ప్రవర్తిస్తారు అసలు నువ్వు ఏదో వాగి ఉంటావ్ లేకపోతే వారు నిన్ను ఎందుకు అంటారు ఒక పార్టీ కి మాత్రమే సపోర్ట్ గా ఉండే నువ్వు వార్త రాస్తున్నవ్ అంటేనే అర్థం చేస్కోవాలి

  3. న్యూట్ర‌ల్‌గా రాస్తే రాయండి. లేదంటే ఏదో ఒక రాజ‌కీయ ప‌క్షం వైపు వుండండి.. మంచిగానే చెప్పారుగా.. దీనిలో నోటి దురుసు ఎక్కడ ఉంది. మీరే కావాలని ఆయన్ని టార్గెట్ చేసి రాసినట్లుగా ఉంది. 

  4. వైఎస్ఆర్సిపి పార్టీ నీ వారి నాయకులను టార్గెట్ చేస్తూ రాస్తూనే ఉంటావా అన్న ఎపుడు ఇదే పనిలో ఉండేలా ఉన్నావ్

  5. వైఎస్ఆర్సిపి పార్టీ నీ వారి నాయకులను టార్గెట్ చేస్తూ రాస్తూనే ఉంటావా అన్న ఎపుడు ఇదే పనిలో ఉండేలా ఉన్నావ్

  6. ఆపవో నీ నాటకాలు…. న్యూట్రల్ అని చెప్పుకోడానికి పూడి శ్రీహరి భుజం మీద నుండి కాలుద్దమని నీ చచ్చు తెలివి అర్థం అయిందిలే ..ఒకే వేల శ్రీహరి అలాంటివాడు అయితే నియమించుకున్న జగన్ ప్రోత్సాహం లేదా?

  7. బొంగులొ బిల్డప్ లు..అదొక పార్టీ..మల్ల.. PRO లు..వట్ట…కాయలు..వాడు జనాల సొమ్ము మింగేసి ప్యాలస్ లు కట్టుకొని ప్రైవేట్ చార్దడ్ లలో ఎంజాయ్ చెస్తూ వున్నాడు..రేపో మాపో.వాడి గు..ద్ద లకూడా చీలటం ఖాయం..వాడు మీకు జీవనోపాది చూపిస్తాడా….ఆదక్క దే..నగేవాడి దగ్గర గీరుక్కు దేం..గడం అంటే ఇదే. కష్టపడి మంచి జర్నలిస్టుల లలగా వార్తలు రాసి బ్రత కండరా…అంతే కాని దొం

    .గ..లు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్టు…ఇది.

  8. మీ ప్రతినిధి వైయస్‌.జగన్‌ను ఉద్దేశించి తక్కువుగా మాట్లాడింది నిజమేనా?

  9. మీ ప్రతినిధి వైయస్‌.జగన్‌ను ఉద్దేశించి తక్కువుగా మాట్లాడింది నిజమేనా?

  10. నీకు దమ్ముంటే ఆ ఐదుగురు జర్నలిస్టుల పేర్లు చెప్పు. ఎవ్వరూ లేరు. నువ్వు చెప్పేది అబద్ధం. ఒక అబద్ధాన్ని పట్టుకుని తప్పుడు రాతలు రాయడం నీకే చెల్లు

  11. జగన్‌ సీపీఆర్వోమీద నువ్వు వరుసగా రాతలు రాయడం ఇది పదోసారి. నీకు ఏదో కక్ష ఉంది. లేదా అక్కడ వ్యవస్థలు నడవికూడదన్న అభిప్రాయమూ ఉంది

  12. జగన్‌ సీపీఆర్వోమీద నువ్వు వరుసగా రాతలు రాయడం ఇది పదోసారి. నీకు ఏదో కక్ష ఉంది. లేదా అక్కడ వ్యవస్థలు నడవికూడదన్న అభిప్రాయమూ ఉంది

  13. ఒక నాయకుడికి అమ్ముడుపోయావు. ఆ నాయకుడు ఏం చెప్తే అది రాస్తావు. ఆనాయకుడు తనకు వ్యతిరేకమని భావించిన వారందరిపైనా రాస్తావు.

  14. కొత్త నాటకం మొదలు పెట్టారు, వాటికన్ ప్యాలెస్ పులకేశి గాడి ముఠా.

    గ్రేట్ ఆంద్ర ఏమో జగన్ కోసమే పని చేస్తున్నట్లు, జగన్ గాడి కింద పని చేసే వాళ్ళు మాత్రం వాడికి వ్యతిరేకం అన్నట్లు కలరింగ్ ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నారు,

     కానీ, జనాలు కి అర్థం అయింది రో యి. మీ కోడికత్తి నాటకాల కి ఇంకా ఛాన్స్ లేదు.

    జగన్ గాడు నుంచో అంటే నుంచునే వాళ్ళు మాత్రమే సజ్జల్, శ్రీహరి , ఎవడైన సరే.  

    ఏంది, జగన్ గాడు సొంత జేబులో డబ్బు తీసి వాళ్ళకి ఇవ్వమని చెప్పాడా, హి హి హి.. 

    నమ్మడానికి జనాలు ఏమన్నా గుడారం లో గొర్రె బిడ్డలు అనుకున్నావా! 

  15. ఒక సీనియర్‌ పార్టీ నాయకుడ్ని ఉద్దేశించి శనీశ్వరుడు అన్నప్పుడే నీ జర్నలిజం సంస్కారం అర్థమైంది

  16. Wow so times of India survey background idannamaata. Ainaa neeku sigguledaa tappu chesina vedavalani venakesukuravataaniki. Vallu chesindi journalism kaadu padupu yrutthi.

  17. నిజ నిజాలు తెలుసుకోకుండా రాయడం తప్పు సాటి జర్నలిస్టు గా ఖండిస్తున్నాను

  18. డబ్బు కోసం తల్లి, చెల్లి నీ తరిమేసి న జగన్ గాడు, 

    ఫ్రీ గా డబ్బు ఇస్తాను అని చెప్పాడా! 

    పల్లెటూర్లో చెడ్డి వేసుకొని పిల్లాడికి చెప్పు, యెత్తి చూపిస్తాడు..

    హి హి హి.

    1. వీడు రాసే ఆర్టికల్స్ కి ఒక్కరు కూడా పాజిటివ్ ఫీడబాక్ ఇవ్వట్లేదు . అందరూ వీడిని ఎంగిలి మెతుకులు ఏరుకునే వెధవ లాగే చూస్తున్నారు . ఒక్కరు కూడా నమ్మట్లేదు . నా కామెంట్స్ కూడా డిలీట్ చేస్తున్నాడు . ఇప్పుడు వీడి నిజాయితీ నిరూపించుకునేందుకు ఈ ఆర్టికల్ వేసాడు. అన్నని కూడా విపరీతంగా తిట్టాడు. ఇప్పుడు లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అన్న లేవాలంటే ఏం కావాలో తెలుసు కదా?? 

      శవం .  

  19. ఆఖరికి దొంగ దొంగ కొట్టుకున్నట్లు అయింది మీ వ్యాసం.

    ఒక పక్క వుండండి వాళ్ళు చెబుతున్నారుగా…website వుందని రాసుకుంట పోతే… పోయేది మీ పరువే

  20. మరి ఇంటి కుక్క ఔనర్ మీదే భౌభౌ అంటే ఆ మాత్రం తిట్టడా ఎంది తన్నలేదు సంతోషించు

  21. ఇంత బాగా తిట్టాడు అంటే ఓరల్ టెస్ట్ పాస్ అన్న మాట. ఇంత కంటే మంచి పోస్ట్ త్వరలో వరిస్తుంది శ్రీ “ఆరి”ని 

Comments are closed.