మోసఫెస్టో.. మాయాఫెస్టో.. విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు

ఒక‌ప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయం చేస్తే ప్రత్యర్థులు భయపడే పరిస్థితి కానీ కొన్ని నెల‌ల క్రితం నుండి సైలెంట్ గా ఉండి వ‌స్తున్నా ఆయ‌న మళ్లీ యాక్టివ్ కావడంతో మెల్ల మెల్లగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శల…

ఒక‌ప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయం చేస్తే ప్రత్యర్థులు భయపడే పరిస్థితి కానీ కొన్ని నెల‌ల క్రితం నుండి సైలెంట్ గా ఉండి వ‌స్తున్నా ఆయ‌న మళ్లీ యాక్టివ్ కావడంతో మెల్ల మెల్లగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ పేరు ఎత్త‌కుండా ఆ పార్టీ మేనిఫెస్టోపై ట్వీట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శలు కురిపించారు.

“రుణ మాఫీ దేవుడెరుగు! డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీలే ఎగ్గొట్టి, కాల్ మనీ గ్యాంగ్స్ తో వేధించిన వాళ్ళు, 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ 15 వందలు ఇస్తారట! ఇది 'మోసఫెస్టో', 'మాయాఫెస్టో' కాదా?”.. అంటూ టీడీపీ మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు. 2014 ఎన్నిక‌ల టైంలో టీడీపీ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత మాఫీ చేయకుండా మోసం చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తు తాజా టీడీపీ మేనిఫెస్టోను మోస‌ఫెస్టోతో పోల్చారు.

నిన్న సీఎం జ‌గ‌న్ ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్రజల కష్టాలు, అవసరాల నుంచి పుడితే టీడీపీ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని.. అక్కడ విజయం కోసం రెండు పార్టీలు ఇచ్చిన హామీలతో బిసిబేళబాత్ వండేశారని ఎద్దేవా చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా విజ‌య‌సాయి రెడ్డి టీడీపీ మేనిఫెస్టోను 'మోసఫెస్టో', 'మాయాఫెస్టో' అంటూ విమ‌ర్శించారు.  

ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో విజ‌య‌సాయిరెడ్డి మ‌ళ్లీ యాక్టీవ్ అవుతుండ‌డంతో పార్టీ వ‌ర్గీయులు ఖుషీ అవుతున్నారు. ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డిని సీఎం జ‌గ‌న్ పిలిపించుకుని గ‌తంలో మాదిరిగా పార్టీ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది.  ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస‌ ట్వీట్స్ చేయ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది.