Advertisement

Advertisement


Home > Politics - Andhra

కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని ఢిల్లీ ర‌మ్మ‌న‌డానికి 10 కార‌ణాలు

కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని ఢిల్లీ ర‌మ్మ‌న‌డానికి 10 కార‌ణాలు

1). కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హ‌యాంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీకి అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. చంపిన వాడే బ‌తికిస్తాడ‌నే దింపుడుక‌ళ్లం ఆశ‌.

2). ఎనిమిదేళ్లుగా అజ్ఞాతంలో వున్నందుకు. క‌న‌బ‌డ‌కుండా పోయిన వాళ్ల‌ని గుర్తించ‌డం కాంగ్రెస్ ప్ర‌త్యేక‌త‌.

3). గుర్రాలు లేని కాంగ్రెస్ ర‌థం ప‌గ్గాలు చేతిలో పెట్ట‌డానికి.

4). సొంతంగా పార్టీ పెట్టి ఒక్క సీటు గెల‌వ‌నందుకు.

5). కాంగ్రెస్ టికెట్లు అడిగే వాళ్లు లేరు కాబ‌ట్టి, క‌నీసం అడిగే వాళ్ల‌కైనా మాజీ సీఎం ప‌లుకుబ‌డితో తెస్తాడ‌ని ఆశ‌.

6). ముస‌లి ఎద్దుల‌తో వ్య‌వ‌సాయం చేయించ‌డం కాంగ్రెస్ క‌ల్చ‌ర్‌.

7). ప‌ని చేయ‌క‌పోయినా మాట‌లు చెప్పేవాళ్లంటే ఢిల్లీ వాళ్ల‌కి ఇష్టం కాబ‌ట్టి.

8). జ‌గ‌న్‌ని అణిచేస్తాన‌ని సీఎం ప‌ద‌వి తెచ్చుకుని జ‌గ‌న్‌ని సీఎం అయ్యేలా చేసినందుకు ప్ర‌త్యేక అభిమానంతో పిలుస్తున్నారు.

9). గెల‌వ‌క‌పోయినా కిర‌ణ్‌కి డిపాజిట్ గ్యారంటీ. ఆంధ్రాలో డిపాజిట్ తెచ్చుకునే కాంగ్రెస్ నాయ‌కులు లేరు కాబ‌ట్టి.

10). త‌మ కాళ్ల మీద లేచి నిల‌బ‌డ‌లేని వృద్ధులు ఢిల్లీ కాంగ్రెస్ నిండా వున్నారు. వాళ్ల‌తో పోల్చుకుంటే కిర‌ణ్ మాజీ క్రికెట‌ర్‌. త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌గ‌ల‌డు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?