Advertisement

Advertisement


Home > Politics - Andhra

మణిశర్మ కూడా కొరటాలపైకి నెట్టేశాడు!

మణిశర్మ కూడా కొరటాలపైకి నెట్టేశాడు!

ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ కాదు, డిజాస్టర్ అయింది. ఈ సినిమా పోయిన వెంటనే దర్శకుడు కొరటాల శివను కార్నర్ చేసే కార్యక్రమం దిగ్విజయంగా మొదలైంది. ఏకంగా చిరంజీవి సైతం దర్శకుడు చెప్పింది చేశామంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అటు మెగా ఫ్యాన్స్ కూడా కొరటాలనే టార్గెట్ చేశారు.

అలా అంతా కలిసి సక్సెస్ ఫుల్ గా ఆచార్య ఫ్లాప్ ను కొరటాల ఖాతాలోకి నెట్టేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మణిశర్మ కూడా చేరిపోయాడు. ఆచార్య సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై చాలా విమర్శలొచ్చాయి. మణిశర్మ తన స్థాయికి తగ్గ స్కోర్ ఇవ్వలేదనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. దానికి కారణం కొరటాల శివ ప్రమేయమేనని తేల్చి చెప్పాడు మణిశర్మ.

"చిరంజీవితో గతంలో ఎన్నో సినిమాలు చేశాను. మ్యూజిక్ డైరక్టర్ గా మారకముందు నుంచే చిరంజీవి గురించి, ఆయన సినిమాల గురించి నాకు తెలుసు. ఆ అనుభవంతో ఆచార్య సినిమాకు నేను ఒక వెర్షన్ చేశాను. అది నాకు కరెక్ట్ అనిపించింది. డైరక్టర్ నా దగ్గరకొచ్చి, ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తున్నారో అది వద్దు, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అన్నారు. డైరక్టర్ చెప్పిన వెంటనే ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడు అనిపించింది. ఆయన సూచనమేరకు కొత్తగా ట్రై చేశాను."

ఇలా ఆచార్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని వెల్లడించాడు మణిశర్మ. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వస్తున్న విమర్శలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరోక్షంగా వెల్లడించాడు.

అయితే ఆ సినిమాలో బీజీఎం బాగాలేకపోయినా, రెండు పాటలు సూపర్ హిట్టయ్యాయని, వాటి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడ్డం లేదని, అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదని మాత్రమే అంటున్నారని ఒకింత బాధపడ్డాడు మణి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?