Advertisement

Advertisement


Home > Politics - Andhra

అందరూ పొలోమంటూ ఇచ్చాపురం వైపే

అందరూ పొలోమంటూ ఇచ్చాపురం వైపే

ఇచ్చాపురం. ఉత్తరాంధ్రా జిల్లాలలో చిట్ట చివరన ఉన్న ప్రాంతం. పొరుగు రాష్ట్రం ఒడిషా బోర్డర్ లో చొచ్చుకుని ఉండే ఇచ్చాపురం ఏపీకి చిట్ట చివరి సరిహద్దు. అందువల్ల రాజకీయ పార్టీలు నాయకులు ఏపీ మొత్తం కలియతిరిగామని చెప్పాలీ అంటే ఇచ్చాపురం దాకా వెళ్ళి అక్కడ తమ టూర్ ని ముగిస్తారు.

అనాడు వైఎస్సార్ కూడా తమ 1300 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు వేదికగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురాన్ని ఎంచుకున్నారు. ఆయన తరహాలో పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు మాత్రం విశాఖలోనే దానిని ముగించేశారు. వైఎస్సార్ తనయ షర్మిల పాదయాత్ర కూడా తెలంగాణాలోని చేవెళ్ళ నుంచి స్టార్ట్ అయి ఇచ్చాపురంలో ముగిసింది.

అదే పంధాలో వైఎస్సార్ తనయుడు జగన్ 2017లో పులివెందుల నుంచి మొదలెట్టిన మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర 2019 జనవరి 9 నాటికి ఇచ్చాపురంలో ముగిసింది. ఇపుడు తెలుగుదేశం చినబాబు నారా లోకేష్ కుప్పం నుంచి మొదలెడుతున్న పాదయాత్ర ఇచ్చాపురంలోనే ముగుస్తుంది ని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీలోని ప్రజా సంఘాలు విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలతో ఆందోళనలకు దిగుతున్నాయి. దాంతో పాటు విద్యార్ధి సంఘాల బస్సు యాత్ర కూడా అనంతపురంలో మొదలైంది. ఈ బస్సు యాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగియనుండడం విశేషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది ఇంకా వివరాలు బయటకు తెలియడంలేదు.

ఏపీలో రాజకీయాలు ఎటు నుంచి ఎటు తిరిగినా వాటి ముగింపు మాత్రం ఇచ్చాపురంలోనే ఉండడంతో ఆ ప్రాంత వాసులకు ఒకింత ఆందనం మరో వైపు బాధగా ఉంది అంటున్నారు. తమ ప్రాంతానికి వచ్చి రాజకీయ ఇచ్చలను తీర్చుకుంటున్నారు కానీ ఇచ్చాపురం గురించి  పట్టించుకోవడం లేదు అంటున్నారు. చిత్రమేంటి అంటే ఇచ్చాపురంలో ఎపుడూ తెలుగుదేశం జెండావే ఎగుగుతుంది. ఎన్ని సార్లు గెలిచినా ఇచ్చాపురం దశ దిశ మారలేదు అని వారు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?