Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖకు ముఖ్యమంత్రి మకాం.. మళ్ళీ మోకాలడ్డు...!

విశాఖకు ముఖ్యమంత్రి మకాం.. మళ్ళీ మోకాలడ్డు...!

విశాఖకు ముఖ్యమంత్రి మకాం మార్చడం దాదాపుగా ఖాయమైంది. రుషికొండ మీద ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు ఖాళీగా ఉన్న ఇతర భవనాలను తీసుకుని కీలక శాఖల ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 

అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ రుషికొండ మీద పెట్టకుండా మరో పిటిషన్ దాఖలు అయింది. దాంతో డిసెంబర్ తొలి వారంలో కేంద్ర బృందం విశాఖకు వచ్చి రుషికొండను సందర్శించనుంది. హైకోర్టుకు కేంద్ర బృందం నివేదిక ఇస్తుంది.

విశాఖలో విమ్స్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దంటూ వామపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. వేరే ఎక్కడైనా పెట్టుకోవాలి కానీ విమ్స్ భవనాలే కావాల్సి వచ్చాయా అని ఎర్రన్నలు అంటున్నారు.

విషయమేంటంటే రుషికొండ మీద టూరిజం భవనాలూ ప్రభుత్వానివే.  విమ్స్ భవనాలూ ప్రభుత్వానివే. కానీ ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ భవనాలలో పెట్టుకోవద్దని విపక్షాలు యాగీ చేయడం కోర్టులకు ఎక్కడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు

ఆరు నూరు అయినా డిసెంబర్ మొదటి వారానికల్లా జగన్ విశాఖ వస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. విశాఖ నుంచి పాలన సీఎం చేస్తారని స్పష్టం చేస్తున్నాయి. క్యాంప్ ఆఫీస్ నుంచి సమీక్ష సైతం ఉంటుందని చెబుతున్నాయి. చివరి ప్రయత్నంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయా లేక విశాఖకు సీఎం మకాం అన్నది జాప్యం అవుతుందా అన్నది బిగ్ డిబేటబుల్ ఇష్యూగా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?