Advertisement

Advertisement


Home > Politics - Andhra

తెలంగాణ‌, ఏపీలో పోలింగ్ ఒకేలా...!

తెలంగాణ‌, ఏపీలో పోలింగ్ ఒకేలా...!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఓట్లు వేసేందుకు పోటెత్తారు. తెలంగాణ‌లో 17 లోక్‌సభ స్థానాల‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 లోక్‌స‌భ‌, 175 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కూ ఇరు రాష్ట్రాల్లో న‌మోదైన ఓట్ల శాతం ఒకే విధంగా వుండ‌డం విశేషం. ఏపీలో 40.26 శాతం, తెలంగాణ‌లో 40.38 శాతం పోలింగ్ న‌మోదైంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట‌ర్లు మాట్లాడుకున్న‌ట్టుగా ఓట్లు వేస్తున్నార‌ని గ్ర‌హించొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ప్ర‌చారం హోరాహోరీగా సాగింది. తెలంగాణ‌లో అత్య‌ధిక లోక్‌స‌భ స్థానాల‌ను హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు కాంగ్రెస్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే సంద‌ర్భంలో బీజేపీ కూడా గ‌ట్టి పోటీ ఇస్తోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పేల‌మైన ఫ‌లితాల‌ను మూట‌క‌ట్టుకుంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం కోసం వైసీపీ, కూట‌మి మ‌ధ్య యుద్ధ‌మే న‌డుస్తోంది. ప్ర‌చారంలో ఒక‌రికి మించి మ‌రొక‌రు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కూట‌మికి ఈసీ స‌హ‌కారం బాగా వుంద‌నే ఆరోప‌ణ లేక‌పోలేదు. ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు చేశారు.

అయిన‌ప్ప‌టికీ తాను ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్న అభిమ‌న్యుడిని కాద‌ని, అర్జునుడిని అంటూ ప‌దేప‌దే చెబుతూ... ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న ర‌గిల్చారు. అలాగే పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ద‌ఫా పోలింగ్ శాతం పెర‌గొచ్చ‌ని అంటున్నారు. ఏపీ ఫ‌లితాలపై సర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?