Advertisement

Advertisement


Home > Politics - Andhra

అసెంబ్లీ వైపు అశోక్‌ చూపు

అసెంబ్లీ వైపు అశోక్‌ చూపు

ఆ మధ్యన రాజకీయాలు అంటే విరక్తిభావాన్ని ప్రకటించిన విజయనగరం జిల్లా సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు మళ్లీ ఇపుడు చురుకుగా ముందుకు వస్తున్నారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోమారు అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. దాంతో ఈసారి రాజుగారు పోటీ చేస్తే శాసనసభకే అని అనుచరులు గట్టిగా చెబుతున్నారు. 

అశోక్‌ సైతం ఢిల్లీ కంటే కూడా రాష్ట్రం వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వచ్చినా టీడీపీతో సఖ్యత లేని కారణంగా అక్కడ ఉత్త ఎంపీగానే ఉండిపోవాలన్న దూరాలోచనతో అశోక్‌ ఎమ్మెల్యేకే పోటీ అంటున్నారు. అవకాశం కలిసివస్తే మరోమారు మంత్రిగా పనిచేయాలన్న ఆశ ఆయనలో ఉందిట. 

ఇక ఆయన కుమార్తె, రాజకీయ వారసురాలు అదితి గజపతిరాజును పార్లమెంట్‌ బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. ఇలా కూతురు అక్కడ తండ్రి ఇక్కడ అని రాజకీయ సర్దుబాటు చేసుకున్నారు. కానీ టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని అంటున్నారు. 

వైసీపీ ఈ సీటులో బీసీ కార్డు కనుక ఉపయోగిస్తే పెద్దాయనను పక్కనపెట్టి కొత్త వారిని టీడీపీ దింపినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?