Advertisement

Advertisement


Home > Politics - Andhra

బూడికి పెరుగుతున్న మద్దతు!

బూడికి పెరుగుతున్న మద్దతు!

వైసీపీ కరెక్ట్ టైం లో సరైన అభ్యర్ధిని ప్రకటించి కూటమికి భారీ షాక్ ఇచ్చింది. జగన్ చాలా వ్యూహాత్మకంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని లాస్ట్ మినిట్ లో ఎంపిక చేసి లాస్ట్ పంచ్ తనదే అని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించడంతో విపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయని అంటున్నారు.

అంగబలం అర్ధబలం అంటూ లెక్కలు చూసుకుంటే జిల్లాలు దాటి తెచ్చిన కూటమి అభ్యర్ధి సీఎం రమేష్ మీద నాన్ లోకల్ ముద్రను వైసీపీ వేస్తోంది. దాంతో దాన్ని ఆయనతో పాటు కూటమి పెద్దలు తిప్పికొట్టలేకపోతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధి బూడి అయితే జగన్ తన పేరుని ప్రకటించిన నాడే విజయం ఖాయం అయింది అని అన్నారు.

తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాను అని స్పష్టం చేశారు. తన పేరు వెల్లడించగానే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని బీసీ సంఘాలు అన్నీ తనకు మద్దతుగా నిలిచాయని ఆయన చెప్పారు. తనకు పార్లమెంట్ నియోజకవర్గం కొట్టిన పిండి అని ఆయన అన్నారు.

తాను జిల్లాకు మంత్రిగా ఎంతో మేలు చేశాను అని ఆయన అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ చరిత్ర చూస్తే నాన్ లోకల్స్ కి జనాలు పట్టం కట్టలేదని ఆయన చెబుతున్నారు గతంలో ఒక పత్రికాధిపతి, ఒక సినీ నిర్మాత ఇలాగే పోటీకి వస్తే జనాలు ఓడించారని గుర్తు చేసారు.

ఇతర ప్రాంతాల వారిని గెలిపిస్తే వారు ప్రజా సమస్యలు ఏమి తీరుస్తారు అని ఆయన ప్రశ్నించారు. గెలిచినా ఓడినా వారు స్థానికంగా ఉండేవారు కాదని ఆయన అంటున్నారు. బూడి మాడుగులను బాగా అభివృద్ధి చేశారు. ఆయన అజాత శత్రువుగా ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు.

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అత్యధిక సంఖ్యలో ఉన్న కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడిని ఢీ కొట్టి గెలవడం ఇపుడు కూటమిని పెద్ద సవాల్ గా మారింది అని అంటున్నారు. కూటమి ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. బూడి అయితే గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?