Advertisement

Advertisement


Home > Politics - Andhra

క్విట్ తెలుగుదేశం.. బాబుపై బొత్స పంచ్

క్విట్ తెలుగుదేశం.. బాబుపై బొత్స పంచ్

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడులో నినాదం అని ప్రకటించారు చంద్రబాబు. దీనిపై భగ్గుమన్నారు బొత్స. క్విట్ చంద్రబాబు..క్విట్ తెలుగుదేశం అంటే సరిగ్గా సరిపోతుందని అన్నారు.

"క్విట్ చంద్రబాబు..క్విట్ తెలుగుదేశం అంటే సరిపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పనైపోయింది. 40 ఇయర్స్ అని చెప్పే చంద్రబాబు తనదంటూ ఒక్క పథకాన్ని లేదా కార్యక్రమాన్ని చెప్పగలరా? రైతుల కోసం చేసింది ఏదైనా ఉందా? అలాంటప్పుడు ఆయన్ను ఎవరు కోరుకుంటారు. ఎప్పుడు ఈ దరిద్రం పోతుందా అనుకుంటారు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అతివృష్టి లేదా అనావృష్టి."

రాజ్యసభ సీట్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించలేదంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని మంత్రి బొత్స తిప్పికొట్టారు. తన హయాంలో బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

"చంద్రబాబు హయాంలో రాజ్యసభ సీట్లన్నీ పెట్టుబడిదారులకే దక్కాయి. ఎవరికి డబ్బులున్నాయో వాళ్లకే రాజ్యసభ ఇచ్చారు. బలహీన వర్గాలకు లేదా తెలుగుదేశం పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఇవ్వలేదు. ఓడిపోతాడని తెలిసి వర్ల రామయ్యతో గతంలో నామినేషన్లు వేయించాడు. అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వొచ్చుగా."

ఇక కోనసీమ వివాదంపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా బొత్స స్పందించారు. పవన్ కల్యాణ్ సమాచార జ్ఞానం లేకుండా మాట్లాడతారని, ఆయన అమాయకుడని, పవన్ ను చూస్తే ఒక్కోసారి జాలేస్తుందని సానుభూతి వ్యక్తం చేశారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?