Advertisement

Advertisement


Home > Politics - Andhra

చంద్రబాబు.. బతుకు పొద్దువాలే వేళ సొంతింటి డ్రామా!

చంద్రబాబు.. బతుకు పొద్దువాలే వేళ సొంతింటి డ్రామా!

ఆయన వయసు 72. సాధారణంగా ఇంకెవరైనా అయితే ఈ వయసులో కృష్ణారామా అనుకుంటూ మనవళ్లను మనవరాళ్లను ఆడించుకుంటూ శేష జీవితాన్ని పిల్లల వద్ద గడిపేస్తారు. పిల్లల ఆదరణకు దిక్కులేని వారు ఆశ్రమాల్లో గడిపేస్తారు. కానీ ఆయన యోధుడు. పైగా కొడుకు సామర్థ్యం మీద నమ్మకం లేనివాడు కనుక ఇంకా కార్యక్షేత్రంలో పోరాడుతున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. 72 ఏళ్ల ముదిమి వయసులో ఇప్పుడు ఇంకా తనకో ఇల్లు కావాలని, ఆస్తి కావాలని ఆరాటపడడమే చిత్రంగా ఉంది. ఈ వయసులో గూడు కట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడంటేనే తమాషాగా అనిపిస్తుంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు… తనను ఏడు దఫాలుగా గెలిపిస్తున్న కుప్పం నియోజకవర్గం మీద హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఇన్ని దశాబ్దాలు గడచిన తర్వాత ఆయన ఆ నియోజకవర్గాన్ని ‘own’ చేసుకుంటున్నారు. తనదిగా భావిస్తున్నారు. ఆ నియోజవకర్గంలో తనకు ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకుంటున్నారు. అందుకే.. అక్కడ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలాన్ని కూడా ఎంచుకున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలాన్ని ఎంపికచేసి.. దాన్ని చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. 

ఈ వయసులో సొంత ఇల్లు ఏంటి? ఎందుకు? అని ఎవ్వరికైనా అనిపించవచ్చు. చంద్రబాబునాయుడుకు హైదరాబాదులో అత్యంత విలాసవంతమైన భవంతి ఉంది. ఫామ్ హౌస్ కూడా ఉంది. విజయవాడలో కరకట్టను ఆక్రమించుకుని నిర్మించిన మరో అక్రమ హర్మ్యంలో ఆయన నివసిస్తుంటారు. ఆ భవంతి యజమానికి తాను అధికారంలో ఉన్నప్పుడు దొడ్డిదారిలో చేయదగినంత మేలు చేసి, ఆ భవనాన్ని లీజుకు తీసుకుని అనుభవిస్తున్నారు. ఇక పోగా, తన స్వగ్రామం నారావారి పల్లెలో ఒక భవంతి ఉంది. సాధారణంగా ప్రతి సంక్రాంతికి కుటుంబ సమేతంగా నారావారిపల్లె ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు బస చేస్తారు. 

ఇన్ని ఉండగా.. ఏడుసార్లుగా ఆయనను అప్రతిహతంగా గెలిపిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మాత్రం ఆయనకు సొంతిల్లు లేదు. అంటే కుప్పంను ఆయన ఏనాడూ సొంతం చేసుకోలేదు. తనదిగా భావించలేదు. ఇదే అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇటీవలి మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఈ అంశం ఒక ప్రచరారాస్త్రంగా వాడింది. ఫలితం అందరికీ తెలిసిందే. తనకు ఇల్లు లేకపోవడం కూడా మైనస్ గా మారుతోందని భావించిన చంద్రబాబు, ఓట్ల కోసం ఇంటి రాజకీయం ప్రారంభించారు. శాంతిపురం మండలం శివపురంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. 

72 ఏళ్ల వయసులో ఆయన జీవితం పొద్దువాలిపోతుండడం మాత్రమే కాదు.. రాజకీయంగా కూడా ఆయన జీవితం ఎన్నడో అస్తమించింది. ఇక సంజెవెలుగులు మాత్రమే మసకమసగ్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన సొంతఇంటిడ్రామా మొదలైంది. వైసీపీ మళ్లీ తనను సొంత ఇల్లు కూడా లేని నాయకుడని విమర్శించే అవకాశం లేకుండా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన నిర్మాణం పూర్తి చేయవచ్చు. కానీ.. ఈ డ్రామాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? అనేది ఒక ప్రశ్న. 

ఇదొక పార్శ్వం అయితే.. రాజకీయ జీవితమే ముగిసిపోతున్న తరుణంలో సొంత ఇల్లు అంటే.. ఆయన తర్వాత.. నారా లోకేష్ కూడా ఇదే నియోజకవర్గాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకుంటాడా అనే అనుమానాలు కూడా పలువురిలో పొడసూపుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?