Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు మొద‌లెట్టిన చంద్ర‌బాబు

జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు మొద‌లెట్టిన చంద్ర‌బాబు

రెగ్యుల‌ర్ బెయిల్ ద‌క్కిన త‌ర్వాత ఆల‌యాల చుట్టూ తిరుగుతున్న చంద్ర‌బాబునాయుడు ...మొద‌టిసారిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. అది కూడా ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న తుపాన్‌ను సాకుగా తీసుకుని చంద్ర‌బాబు త‌న మార్క్ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం విశేషం.

చంద్ర‌బాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ త‌మ హ‌యాంలో తుపాన్లు వ‌స్తే, ప్ర‌త్యేక జీవోల‌తో సాయం చేశామ‌ని గుర్తు చేశారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం తుపాను బాధితుల‌కు సాయం అందించ‌డంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం మిచౌంగ్ తుపాన్ వ‌ల్ల చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యార‌న్నారు. వాళ్లంతా ఆక‌లితో అల‌మటిస్తుంటే భోజ‌నం పెట్ట‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

తుపాన్‌ను ఎదుర్కొనేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌న్నారు. తుపాను బాధితుల‌తో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడి ఇబ్బందుల‌ను తెలుసుకున్నారు. పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌కు అందుకు త‌గ్గ‌ట్టు ప‌రిహారం చెల్లించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. అలాగే ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా బాధితుల‌ను ఆదుకునేందుకు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క్షేత్ర‌స్థాయికి వెళ్లాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

తుపాన్‌పై ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేసినా ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బాబు విమ‌ర్శించారు. వ్య‌వ‌స్థ‌ల నిర్వీర్యం వ‌ల్లే నేడు ఈ దుస్థితి నెల‌కుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదని బాబు హిత‌వు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?