Advertisement

Advertisement


Home > Politics - Andhra

అరెస్ట్ తరువాత ఫస్ట్ టైం బాబు అక్కడకు !

అరెస్ట్ తరువాత ఫస్ట్ టైం బాబు అక్కడకు  !

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన బాబుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. చంద్రబాబు ప్రస్తుతం లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. మీడియాతో కూడా రాజకీయాలు మాట్లాడటం లేదు.

టైం డేట్ ఫిక్స్ చేసుకుని సరైన వేదిక మీదనే పెద్ద ఎత్తున వైసీపీ మీద విమర్శలు చేయాలన్న వ్యూహంతోనే బాబు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం బాబు ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. వెంకన్న దర్శనం తరువాత ఆయన ఉత్తరాంధ్ర వస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన చంద్రబాబు విశాఖ వస్తున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సింహాద్రి అప్పన్న దర్శనం బాబు చేసుకుంటారు అని అంటున్నారు. చంద్రబాబు విశాఖ వచ్చి నాలుగైదు నెలలు గడచాయి. అరెస్ట్ లేకపోయి ఉంటే బాబు జిల్లా టూర్లు ఉత్తరాంధ్రాలో సాగేవి. ఇపుడు చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి బాబుని చూసేందుకు తమ్ముళ్ళు ఉత్సాహం మీద ఉన్నారు.

చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు సిద్ధం కావాలని ఆ పార్టీ పిలుపు ఇస్తోంది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకుని భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలను తీసుకుని రావాలని పార్టీ నేతలు కోరుతున్నారు. బాబు విశాఖలో కూడా మీడియాతో ఏమీ మాట్లాడకపోవచ్చు అంటున్నారు. 

విశాఖ సహా ఉత్తరాంధ్రా పార్టీ పరిస్థితి మీద ఆయన ఒక సమీక్ష అయితే నిర్వహించే అవకాశం ఉంది అంటున్నారు. బాబు రాకతో తమ్ముళ్ళు ఇపుడు అలెర్ట్ అవుతున్నారు. పెద్దాయన కళ్లలో పడాలని నాయకులు సిద్ధం అవుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?