Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఏబీ, రిటైర్డ్ ఐపీఎస్ ఠాకూర్‌పై వైసీపీ ఫిర్యాదు

ఏబీ, రిటైర్డ్ ఐపీఎస్ ఠాకూర్‌పై వైసీపీ ఫిర్యాదు

ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్పీ ఠాకూర్‌ల‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. వీళ్లిద్ద‌రూ మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో కూచుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పోలీస్ అధికారుల‌కు ఫోన్లు చేస్తూ, టీడీపీకి అనుకూలంగా ప‌ని చేయాల‌ని బెదిరిస్తున్న‌ట్టు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో వైసీపీ పేర్కొంది. కూట‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని పోలీస్ అధికారుల‌ను బెదిరిస్తూ, లొంగ‌దీసుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వైసీపీ ఆరోపించింది.

ఉన్న‌తాధికారైన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, అలాగే గతంలో కీల‌క పోస్టుల్లో ప‌ని చేసిన ఆర్పీ ఠాకూర్ గ‌తంలో త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని, ఎన్నిక‌ల్లో టీడీపీకి అనుకూలంగా ప‌ని చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏకంగా టీడీపీ కార్యాల‌యంలో వాళ్లిద్ద‌రు తిష్ట‌వేసి త‌మ‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నార‌నేది వైసీపీ ఆరోప‌ణ‌.

త‌మ‌కు ఏబీ, ఠాకూర్ ఫోన్ చేసి టీడీపీకి అనుకూలంగా ప‌ని చేయాల‌ని బెదిరిస్తుండ‌డాన్ని అధికార పార్టీ నేత‌ల దృష్టికి కొంద‌రు పోలీస్ అధికారులు తీసుకెళ్లారు. దీంతో వైసీపీ అప్ర‌మ‌త్త‌మైంది. ఎన్నిక‌ల రోజు కావ‌డంతో, వాళ్లిద్ద‌రి వ‌ల్ల న‌ష్టం వాటిల్ల‌కుండా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. స‌హ‌జంగా వైసీపీ ఫిర్యాదుల‌సై ఈసీ ఇంత వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తాజా ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందో మ‌రి! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?