Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఓడింది ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి

ఓడింది ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి

ఓటింగ్ జ‌రుగుతూ వుంది. విజేత‌ల్ని ఈ పాటికి జ‌నం నిర్ణ‌యించేసి వుంటారు. ఎవ‌రో ఒక‌రు గెలుస్తారు. కానీ తెలుగు నేల‌పై శాశ్వ‌తంగా ఓడిపోయింది మాత్రం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌, ద‌శాబ్దాల గుర్తింపు అన్నీ గాలికి వ‌దిలేసి న‌గ్నంగా చంద్ర‌బాబు భ‌జ‌న చేసి న‌వ్వుల‌పాలై, దిగ‌జార‌డానికి వీల్లేనంత పాతాళానికి దిగిపోయాయి. ఇప్ప‌టికే ప‌త్రిక‌ల పేరుతో, ప్ర‌జాస్వామ్య సంర‌క్ష‌ణ నాట‌కంలో వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకున్నాయి. ఇక ప‌త్రిక‌లు వుంటే ఎంత‌, పోతే ఎంత అని బాబు త‌ర‌పున బ‌ట్ట‌లు లేని యుద్ధం చేసి , ఎదుటి వారి విలువ‌ల్ని ప్ర‌శ్నించాయి.

వీళ్ల దృష్టిలో ఐదేళ్ల‌లో జ‌గ‌న్ ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదు. అత‌నో నియంత‌. విధ్వంస‌కుడు, అప్పుల కుప్ప‌. ప‌రిపాల‌న‌కి ప‌నికి రాడు. ఆయ‌న‌కి దోచుకోవ‌డ‌మే ల‌క్ష్యం. జ‌గ‌న్ దిగిపోతే ప్ర‌జ‌ల‌కి సుఖ‌శాంతులు.

న్యూస్ పేప‌ర్ చ‌రిత్ర‌లో ఒక ముఖ్య‌మంత్రిపై ఇంత దారుణ దాడి జ‌ర‌గ‌లేదు. సోష‌ల్ మీడియా ఎదురు దాడి లేక‌పోతే జ‌నం కూడా ఇదంతా నిజ‌మ‌ని న‌మ్మేవాళ్లు. ఈ రెండు ప‌త్రిక‌ల్ని కౌంట‌ర్ చేయ‌డానికి జ‌గ‌న్ తెలివిగా సాక్షి పెట్టుకున్నాడు కానీ, అక్క‌డ‌న్నీ ఎలుక‌లు చేరుకుని చిలుక‌ల్ని కొరికి తినేశాయి. ఇనుప తుక్కు, మోకాళ్ల‌లో మెద‌డుని నిక్షిప్తం చేసుకుని జీవించే క‌లుగు నివాసుల‌తో దాన్ని నింపేసి మేప‌డం వ‌ల్ల ఈ ఎన్నిక‌ల్లో అదో ద‌ద్ద‌మ్మ పాత్ర పోషించింది. జ‌గ‌న్ అదృష్టం ఏమంటే హార్డ్‌కోర్‌గా ప‌ని చేసే సోష‌ల్ మీడియా అన్ని వైపుల నుంచి కాపు కాసింది (వీళ్ల‌నే ప్ర‌త్య‌ర్థులు ముద్దుగా పేటీఎం బ్యాచ్ అంటారు. మ‌రి టీడీపీ సోష‌ల్ మీడియాని ఏమ‌నాలి? ఫోన్ పే బ్యాచా?).

సాక్షికి ఎదురు దాడి, ఆత్మ‌ర‌క్షణ రెండూ స‌రిగా చేత‌కావ‌నే క్లారిటీ వుండ‌డంతో ఈనాడు, జ్యోతి విజృంభించాయి. ఎంత‌లా అంటే రాప్తాడు స‌భ‌కి ల‌క్ష‌ల్లో వ‌స్తే ఆ వార్త ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించ‌నే లేదు. సిద్ధం స‌భ‌లు సూప‌ర్ హిట్ అయితే ఈనాడు జ‌నం లేర‌ని రాసింది. ప్ర‌పంచంలో ఐసిస్, ఆల్‌ఖైదా రెండు గ్రూపులున్నాయి. ఆల్‌ఖైదా ప్ర‌తిదీ ప్లాన్ చేసి అమ‌లు చేస్తుంది. ఐసిస్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు దాడి చేస్తుంది. ప్లానింగ్ వుండ‌దు.

జ‌గ‌న్ మీద ఐసిస్ త‌రహా దాడి జరిగింది. వివేకా హ‌త్య కేసు అంటూ ష‌ర్మిల‌తో దాడి చేయించారు. ఇంకా అమ‌ల్లో లేని ల్యాండ్ యాక్ట్‌ని భూతంగా చూపించారు. తెల్లారే స‌రికి మీ భూములు మీకు వుండ‌వ‌న్నారు. మ‌ద్యం బ్రాండ్లు అంటూ గ‌లభా చేశారు. చంద్ర‌బాబు మ‌ద్య నిషేధాన్ని ఎత్తి వేసిన‌ప్పుడు సారా ఉద్య‌మ సృష్టిక‌ర్త ఈనాడు నోరు మెద‌ప‌కుండా నాటకం ఆడింది. ఆర్థిక విధ్వంసం అంటూ గావు కేక‌లు పెట్టిన వాళ్లు చంద్ర‌బాబు సూప‌ర్‌సిక్స్‌పై నోరు మెద‌ప‌లేదు. వాలంటీర్ల‌ని మ‌హిళా కిడ్నాప‌ర్లు అన్న నోటితోనే జీతం పెంచుతానంటే కిక్కురుమ‌న‌లేదు.

ఏనాడూ సంప‌ద సృష్టించ‌ని చంద్ర‌బాబు సంప‌ద సృష్టిస్తానంటే చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఇంగ్లీష్ మీడియాన్ని దుమ్మెత్తి పోసిన వాళ్లు సైలెంట్‌గా వున్నారు. త‌ల్లిని, చెల్లిని త‌రిమేశాడ‌ని పిక్చ‌ర్ ఇచ్చిన వాళ్లు చంద్ర‌బాబు త‌న కుటుంబానికి ఎపుడు అండ‌గా ఉన్నాడో చెప్ప‌రు. రామ్మూర్తినాయుడిని రాజ‌కీయాల నుంచి త‌రిమేసిందెవ‌రో చెప్ప‌రు. మామ ఎన్టీఆర్ కుటుంబాన్ని క‌రివేపాకుగా వాడిన విష‌యం మాట్లాడ‌రు.

జ‌గ‌న్ పేద‌ల్ని ఆదుకున్న విధానం, నాడు-నేడు, ఫ్యామిలీ క్లీనిక్‌, ఇంటి ద‌గ్గ‌రే పింఛ‌న్లు , వాలంటీర్లు , స‌చివాల‌యం, నాణ్య‌మైన మ‌ధ్యాహ్న భోజ‌నం ఇవేవీ క‌న‌ప‌డ‌వు. జ‌గ‌న్ మీద వెయ్యి ఆరోప‌ణ‌లు చేస్తున్న వారు ఈ ఐదేళ్ల‌లో ఒక్క కుంభ‌కోణాన్ని కూడా వెలికి తీయ‌లేక‌పోయారు.

ఇదంతా దేనికి? జ‌గ‌న్ వుంటే వీళ్ల ప‌ప్పులుడ‌క‌వు. ప‌త్రిక‌ల ముసుగులో వ‌చ్చే ఆదాయం రాదు. వీళ్ల సొంత ప్ర‌యోజ‌నం కోసం ప‌త్రిక‌ల్ని తాక‌ట్టు పెట్టి నాట్యం చేశాయి. ప్ర‌జాప్ర‌యోజ‌నాలు అనేవి ముసుగు మాత్ర‌మే.

జ‌గ‌న్‌పైన జ‌నం నిర్ణ‌యించుకుంటారు. అది వాళ్ల హ‌క్కు. కానీ జ‌ర్న‌లిజం పేరుతో జ‌రిగిన ఈ డ్రామాని అంద‌రూ గుర్తుంచుకుంటారు. ఓడినా, గెలిచినా జ‌గ‌న్ ఓ చ‌రిత్ర‌. కానీ ఎంతో చ‌రిత్ర క‌లిగిన రెండు ప‌త్రిక‌లు శాశ్వ‌తంగా చ‌రిత్ర హీనంగా మిగిలాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?