Advertisement

Advertisement


Home > Politics - Andhra

అది ఒరిజినల్ కాదు!

అది ఒరిజినల్ కాదు!

హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప తెలిపారు.

వీడియోను చూస్తున్న విజువల్స్ ను వీడియో చేసి పోస్ట్ చేశారన్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాకపోవడంతో నిర్ధారించలేకపోతున్నామన్నారు. ఎడిటింగ్ తో, మార్ఫింగ్ చేశారనే అనుమానాలున్నాయని ఎస్పీ తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీనిపై నిర్ధారణకు రాలేమన్నారు.

వీడియో మొద‌ట ఐ టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన వీడియోను ఎడిటింగ్ చేసి ఫార్వాడ్ చేశార‌న్నారు. ఒరిజిన‌ల్ వీడియో ఉంటేనే ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంప‌గ‌లం అని మీడియా స‌మావేశంలో చెప్పారు.

మాధ‌వ్ పై ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్‌సీపీని, ఆ పార్టీ నేతను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో మ‌రి.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను