Advertisement

Advertisement


Home > Politics - Andhra

రాజీకి ససేమిరా అంటున్న ఎస్ కోట తమ్ముళ్ళు!

రాజీకి ససేమిరా అంటున్న ఎస్ కోట తమ్ముళ్ళు!

ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి అయిదేళ్ల పాటు ఆర్ధికంగా అన్ని రకాలుగా పని చేయించుకుని తీరా టికెట్ కేటాయింపులో తీరని అన్యాయం చేశారని ఎస్ కోట తమ్ముళ్లు టీడీపీ అధినాయకత్వం మీద రగిలిపోతున్నారు. తాము ఎవరి మాట వినమని రాజీ పడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

ఎస్ కోటలో కీలక నేతగా టీడీపీలో ఉన్న ఎన్నారై గొంప క్రిష్ణకు టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారికే మరోసారి ఇచ్చారు. దాంతో గొంప క్రిష్ణ వర్గం టీడీపీకి రాజీనామా చేసేంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇది తెలిసి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ రెబెల్స్ టీం తో చర్చలు జరిపారు. అయితే వారంతా తాము ఎట్టి పరిస్థితులలోనూ పార్టీ మాట వినేది లేదని తేల్చి చెప్పారు. తాము టీడీపీకి పనిచేయాలంటే గొంప క్రిష్ణకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము తగ్గేది లేదని ఎస్ కోట నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు.

దాంతో బాలయ్య అల్లుడి రాయబారం విఫలం అయింది. హైకమాండ్ దృష్టికి తీసుకుని వచ్చి రెండు రోజులలో న్యాయం చేసేలా చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఎస్ కోటలో రెబెల్స్ తగ్గకపోవడం విశాఖ ఎంపీ సీటు మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?