Advertisement

Advertisement


Home > Politics - Andhra

ప‌వ‌న్ పాలిట జోరీగ‌!

ప‌వ‌న్ పాలిట జోరీగ‌!

అస‌లే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప‌వ‌న్ పాలిట ఆయ‌న జోరీగ అయ్యారు. ఆయ‌నే మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య‌. ఆయ‌నేమీ జ‌న‌సేన‌లో స‌భ్య‌త్వం తీసుకోలేదు. కానీ జ‌న‌సేన శ్రేయోభిలాషిగా నిత్యం త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తుంటారు. జీవిత చ‌ర‌మాంకంలో ఉన్న ఆ కాపు వృద్ధ‌నేత‌... త‌మ కులం నుంచి సీఎంగా చూడాల‌నే ఆశ‌తో ఉన్నారు. గ‌తంలో చిరంజీవిపై ఆశ‌లు పెట్టుకుని, చివ‌రికి ఆయ‌న్ను బండ‌బూతులు తిడుతూ బ‌హిరంగ లేఖ రాశారు.

ఇప్పుడు మెగాస్టార్ త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు. తాజాగా ఆయ‌న రాసిన బ‌హిరంగ లేఖ జ‌న‌సేన‌లో క‌ల్లోలాన్ని ప్ర‌తిబింబిస్తోంది. టీడీపీతో పొత్తు ప‌వ‌న్‌తో పాటు కొంత మంది నేత‌ల‌కు మాత్ర‌మే ఇష్ట‌మ‌ని, మెజార్టీ మాత్రం వ్య‌తిరేకిస్తోంద‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చేలా ఇటీవ‌ల సొంత పార్టీ నేత‌ల‌పై కోవ‌ర్టుల‌నే ముద్ర‌తో బ‌ల‌ప‌డింది.

చేగొండి హ‌రిరామ జోగ‌య్య లేఖ‌లో ప్ర‌స్తావించిన అంశాలు టీడీపీని భ‌య‌పెడుతున్నాయి. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు టికెట్లు ఇవ్వ‌డం ద్వారా ఏ మేర‌కు వారి ఓట్లు బ‌దిలీ అవుతాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. టీడీపీ త‌న రాజ‌కీయ ప్ర‌యోజనాల కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను బ‌లి చేస్తోంద‌ని, త‌మ‌ను ప‌ల్లకీ మోయ‌డానికి వాడుకుంటోంద‌నే ఆవేద‌న జ‌న‌సేన నేత‌ల్లో వుంది. హ‌రిరామ జోగ‌య్య లేఖ‌లో పేర్కొన్న కీల‌క అంశాలు ఏవంటే...

"ఓట్లు కావాలంటారు పవన్ కళ్యాణ్. అధికారం కావాలంటారు జన సైనికులు. ఏది ముందు? ఏది వెనుక? అని ఆయ‌న జ‌నసేన‌లో సాగుతున్న అంత‌ర్మ‌థ‌నాన్ని ఆవిష్క‌రించారు. హ‌రిరామ జోగ‌య్య విశ్లేష‌ణ బాగుంది. ప‌వ‌న్‌, జ‌న‌సేన శ్రేణుల అభిప్రాయాల‌కు పూర్తి వైరుధ్యం వుంద‌ని ఆయ‌న అభిప్రాయం. టీడీపీకి ఓట్లు వేయ‌మ‌ని చెప్ప‌డం స‌రే, అధికారం మాటేంటి? అని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

ప‌వ‌న్ మాత్రం రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోస‌మే పొత్తు అని చెబుతున్నార‌ని, అధికారం ద‌క్క‌కుండా ప్రజా శ్రేయస్సు ఎలా సాధిస్తార‌ని జన సైనికులు కీల‌క‌మైన ప్ర‌శ్న సంధిస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. జ‌న‌సేన‌లోనే ఇంత గొడ‌వ జ‌రుగుతుంటే, ఇక  ప‌వ‌న్ చెప్పిన‌ట్టు త‌మ‌కు ఓట్లు వేస్తార‌ని న‌మ్మేదెట్టా? అని టీడీపీ నేత‌లు అడుగుతున్న ప్ర‌శ్న‌. దీన్ని కొట్టి పారేయ‌లేం. అరె, ప‌వ‌న్‌కే దిక్కు లేక‌పోతే, ఇక ఆయ‌న సూచించిన‌ట్టు చంద్ర‌బాబుకు ఓట్లు వేస్తార‌ని ఎలా అనుకుంటామ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కాపు వృద్ధ నేత ఇలాంటి చుర‌కైన ప్ర‌శ్న‌ల‌తో ప‌వ‌న్ చెవిలో జోరీగ మాదిరిగా త‌యార‌య్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?