Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబు వస్తే పధకాలు అన్నీ బంద్!

బాబు వస్తే పధకాలు అన్నీ బంద్!

ఏపీలో ఎన్నికల వాతావరణం మెల్లగా ఏర్పడుతోంది. ఏ నాయకుడు మాట్లాడినా వచ్చే ఎన్నికల గురించే ప్రస్థావిస్తున్నారు. ఇంకా రెండేళ్ళ సమయం సార్వత్రిక ఎన్నికలకు ఉన్నా జనాల మూడ్ మార్చేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయి. దానికి ధీటుగా అధికార వైసీపీ నేతలు జవాబు చెబుతున్నారు.

ఉమ్మడి విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అయితే ఈ విషయంలో కాస్తా ముందున్నారు. ఆయన మీడియాతో మాట్లాడినా లేక ప్లీనరీలలో ప్రసంగం చేసినా టీడీపీని దాని విధానాలకు తూర్పార పడుతున్నారు. ఆయన లేటెస్ట్ గా విశాఖలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కనుక పొరపాటున వస్తే కచ్చితంగా రాష్ట్రం ఇబ్బందులలో పడడం ఖాయమని జోస్యం చెప్పారు.

చంద్రబాబు వస్తే ఏపీలో జగన్ నాయకత్వాన వెల్లువలా అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఒక్క దెబ్బకు మంగళం పాడేస్తారు అని వైవీ పేర్కొంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్ కి సరిసాటి నాయకుడు దేశంలో ఎవరూ లేరని ఆయన అన్నారు.

ఏపీలో గత మూడేళ్ళలో జరిగిన అనేక ఎన్నికల్లో వైసీపీని తప్ప మరో పార్టీ వైపు జనాలు చూడలేదు అంటే ఎంతటి గట్టి మద్దతు తమ పార్టీకి ప్రజలలో ఉందో అర్ధం చేసుకోవచ్చు అని ఆయన విశ్లేషిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఇలాంటి ఫలితాలను చూడగలమా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని ప్రతిపక్షాలు అంటున్నాయి, దానికి సరైన సమాధానమే వైవీ చెప్పారనుకోవాలి. అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటే కదా అని ఆయన చాలా లైట్ గా కూల్ గా జవాబు చెబుతున్నారు. విపక్షాలకు అనవసర ఆయాసం తప్ప ఏపీలో ఉన్న ఓట్లన్నీ ఒకే పక్ష‌మని, అది వైసీపీ పక్షమని సుబ్బారెడ్డి అంటున్నారు. 

అయితే ఆయన అన్న మాటలలో ఒక విషయం మాత్రం జనాలను బాగా ఆలోచింపచేసేదే. రేపటి రోజున చంద్రబాబు కనుక వస్తే మాత్రం జగన్ సంక్షేమ పధకాలు కొనసాగిస్తారా. దీని మీదనే వైసీపీ జనాలలో పెద్ద ఎత్తున చర్చకు పెడుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?