Advertisement

Advertisement


Home > Politics - Andhra

పవన్ టైటిల్ తో తేజ్.. ఆసక్తికర చర్చ

పవన్ టైటిల్ తో తేజ్.. ఆసక్తికర చర్చ

సాయితేజ్ సినిమాకు సంబంధించి ఈరోజు టైటిల్ విడుదల చేశారు. టైటిల్ తో పాటు ఒకేసారి గ్లింప్స్ వీడియోను, విడుదల తేదీని కూడా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో, ఈ రోజంతా సాయితేజ్ సినిమా టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ అంశాలతో పాటు మరో అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ అంశమే విరూపాక్ష టైటిల్. నిజానికి ఈ టైటిల్ ఎప్పుడో వెలుగులోకి వచ్చింది. పవన్ కల్యాణ్ సినిమా కోసం ఈ టైటిల్ ను గతంలో పరిశీలించారు.

క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెడతారని అంతా అనుకున్నారు. ఓ దశలో దర్శకుడు క్రిష్ కూడా విరూపాక్ష టైటిల్ పై స్పందించాడు. తమ సినిమాకు అది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని ప్రకటించాడు.

అలా పవన్-క్రిష్ సినిమా చుట్టూ కొన్ని నెలల పాటు ఈ టైటిల్ తిరిగింది. ఇక దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ అనుకుంటున్న టైమ్ లో, కొత్త టైటిల్ ప్రకటించాడు క్రిష్. అలా పక్కకెళ్లిపోయిన విరూపాక్ష టైటిల్, మళ్లీ ఇన్ని రోజులకు తెరపైకొచ్చింది.

పవన్ మేనల్లుడు సాయితేజ్, తన కొత్త సినిమాకు ఈ విరూపాక్ష టైటిల్ పెట్టుకున్నాడు. ఈరోజు అదే టైటిల్ ను ఎనౌన్స్ చేశాడు కూడా. దీంతో పవన్-క్రిష్ సినిమా పాత ముచ్చట్లు మరోసారి సోషల్ మీడియాలో తెరపైకొచ్చాయి.

కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోంది విరూపాక్ష సినిమా. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న సినిమాను విడుదల చేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?