Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌లో ధీమా!

జ‌గ‌న్‌లో ధీమా!

ఘోర ప‌రాజయంతో వైసీపీ ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర నిరాశ‌, నిస్పృహ‌ల‌కు లోన‌య్యారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో కూడా అవి క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి వైసీపీ అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున తాడేప‌ల్లికి వెళుతున్నారు. అంద‌రితోనూ జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. విశేషం ఏమంటే... జ‌గ‌న్‌ను వారంతా ఓదార్చ‌డం.

తామంతా మీతోనే ఉన్నామ‌ని, మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని, ధైర్యంగా వుండాల‌ని జ‌గ‌న్‌కు నాయ‌కులు భ‌రోసా ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అనూహ్యంగా నాయ‌కుల మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డం జ‌గ‌న్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్‌లో మ‌ళ్లీ ధీమా క‌నిపిస్తోంద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల్ని జ‌గ‌న్‌కు నాయ‌కులు వివ‌రిస్తున్నారు. కూట‌మి హామీలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌, ఇసుక‌, మ‌ద్యం పాల‌సీలు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పింఛ‌న్‌ను రూ.4 వేలు, అలాగే రైతుల‌కు క‌నీసం రూ.ల‌క్ష రుణ‌మాఫీ చెప్పి వుంటే, ఫ‌లితాలు వేరేగా వుండేవ‌ని జ‌గ‌న్‌కు మెజార్టీ నాయ‌కులు చెబుతున్నార‌ని తెలిసింది.

ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను నాయ‌కుల నుంచి ప్ర‌తిదీ జ‌గ‌న్ సేక‌రిస్తుండ‌డం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో జ‌గ‌న్ రాజ‌కీయంగా త‌ట్టుకుంటారా? లేదా? అనే చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడ‌క‌నే ఏపీలో అరాచ‌కాలు, అలాగే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు సాధ్యం కాద‌ని, త‌ప్ప‌కుండా వైసీపీకి మంచి రోజులు వ‌స్తాయ‌ని నాయ‌కులు జ‌గ‌న్‌కు ధైర్య వ‌చ‌నాలు చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ కూడా వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడుతున్న‌ట్టు వీడియోలు, ఫొటోలు చూస్తే తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?