Advertisement

Advertisement


Home > Politics - Andhra

అంశాలవారీగా చాకిరేవు పెట్టిన జగన్

అంశాలవారీగా చాకిరేవు పెట్టిన జగన్

ఊహించినట్టుగానే జగన్ తన విశ్వరూపం చూపించారు. వరుస కౌంటర్లతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు చాకిరేవు పెట్టారు. ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేసినట్టు కాకుండా.. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ, పద్ధతిగా చంద్రబాబు, పవన్ కు కౌంటర్లు ఇచ్చారు ముఖ్యమంత్రి. బాబు-పవన్ కు అంశాలవారీగా జగన్ ఇచ్చిన కౌంటర్లను చూద్దాం

మేనిఫెస్టో గురించి..

చంద్రబాబు, దత్తపుత్రుడు మీ (ప్రజల) దగ్గరకు వస్తే గట్టిగా అడగండి. చంద్రబాబు మేనిఫెస్టో గురించి నిలదీయండి. హామీలు ఎందుకు నేరవేర్చలేదని అడగండి. ఏ హామీని అమలు చేయని చంద్రబాబు మంచోడంట. రుణమాఫీ పేరిట మోసం చేసిన ఈ చంద్రబాబు మంచోడట. 

విద్యుత్ బకాయిలు, ఇన్ పుట్ సబ్సిడీ బకాయిల్ని ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడట. ఈ మాటల్ని టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడు చెబుతారు. మీ జగన్ మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేశాడు. మూడేళ్ల పాలన తర్వాత మేనిఫెస్టో చూపించి మరీ గడప గడపకు వెళ్తున్నాం. ఈ తేడాను అంతా గమనించాలి.

పదో తరగతి పరీక్షలపై..

మనకు 67శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. రెండేళ్లు కరోనా వల్ల పరీక్షలు లేవు. ఒక్కసారిగా పరీక్షలు వచ్చాయి. అయినా ఇది మంచి శాతమే. గుజరాత్ లో 65శాతమే పాస్ అయ్యారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంచే మాటలు చెప్పాలి. నిరుత్సాహపరచకూడదు. అలాంటి పిల్లల కోసం సప్లమెంటరీ/కంపార్ట్ మెంట్ పాస్ ను తీసేస్తున్నాం. 

నెల రోజుల్లో పరీక్షలు పెట్టి అందులో పాస్ అయిన పిల్లలకు కూడా రెగ్యులర్ పాస్ కింద ఇస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. ఇప్పుడీ పిల్లల్ని సైతం ప్రతిపక్షం చెడగొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంతో పిల్లలు పోటీపడాలంటే నాణ్యమైన విద్య అందించాలి, పరీక్షలు నిర్వహించాలి.

ఎల్లో మీడియా అరాచకాలపై..

ప్రజలకు ఏదైనా మంచి జరిగితే వీళ్లు తట్టుకోలేరు. దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లంతా ఏకమౌతారు. 

ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అబద్ధానికి రంగులు పూసేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. వీళ్ల పనుల్ని ప్రజలు గమనించాలి.

కోనసీమ వివాదంపై..

కోనసీమకు ఓ మహానుభావుడి పేరు పెడితే, అంబేద్కర్ పేరు పెట్టడానికి నిరసనగా అల్లర్లు చేయించారు. ఏకంగా ఓ ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టారు. ఓ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదేనా సామాజిక న్యాయం. ఇలాంటి చంద్రబాబు, రాజకీయాల్లో ఉండడానికి అర్హుడేనా? నా పాలనలో 70శాతం పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారనే విషయం అందరూ గమనించాలి. 

ఎన్ని అరాచక శక్తులు కలిసొచ్చినా, తనపై ఎంత తప్పుడు ప్రచారం చేసినా, ప్రజలకు మంచి చేసే విషయంలో తన పంథాను ఎవ్వరూ మార్చలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?