Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్ భారీ ప్ర‌క్షాళ‌న‌!

జ‌గ‌న్ భారీ ప్ర‌క్షాళ‌న‌!

తెలంగాణలో అధికార పార్టీ ఓట‌మి త‌ర్వాత ఏపీ రాజ‌కీయంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఓట‌మి నుంచి సీఎం జ‌గ‌న్ గుణ‌పాఠాలు నేర్వ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చ‌క‌పోవ‌డం వ‌ల్లే బీఆర్ఎస్ ఓట‌మిపాలైంద‌నే టాక్ వినిపిస్తోంది. కొత్త అభ్య‌ర్థుల‌ను నిలిపిన చోట బీఆర్ఎస్‌కు సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా భారీ ప్ర‌క్షాళ‌న చేప‌ట్ట‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను చిత్త‌శుద్ధితో అమ‌లు చేస్తోంది. కానీ అధికార పార్టీపై వ్య‌తిరేక‌త ఉంద‌న్న ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు ప‌లు స‌ర్వే సంస్థ‌లు త‌మ నివేదిక‌ల‌ను జ‌గ‌న్‌కు స‌మ‌ర్పించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను కొన‌సాగిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించారు. అందుకే ఆయ‌న చాలా చోట్ల ఎమ్మెల్యేల‌ను మార్చ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. ప్ర‌త్యామ్నాయంగా అభ్య‌ర్థుల‌ను సిద్ధం చేసుకుంటున్నార‌ని స‌మాచారం. ప‌లు స‌ర్వేల్లో వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉన్న ఎమ్మెల్యేల‌ను పిలిపించుకుని జ‌గ‌న్ మాట్లాడుతున్నారు.

ఇక స‌రిదిద్దులకోలేనంత‌గా చెడ్డ పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వ‌లేన‌ని జ‌గ‌న్ తేల్చి చెబుతున్నారు. టికెట్ ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ప్ర‌త్యామ్నాయంగా నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తాన‌ని స‌ర్ది చెబుతున్నారని తెలిసింది. దీంతో చేసేదేమీ లేక కొంత మంది ఎమ్మెల్యేలు మౌనంగా వుంటున్నారు. 

టీడీపీ విష‌యానికి వ‌స్తే చంద్ర‌బాబు నిర్ణ‌యాలు తీసుకోడానికి వెనుకాముందు ఆడుతున్నారని తెలిసింది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ లేని నాయ‌కుల‌కు టికెట్లు ఇవ్వ‌లేన‌ని తేల్చి చెప్ప‌డానికి జ‌గ‌న్ మాదిరిగా త‌మ నాయ‌కుడు సాహ‌సించ‌లేక‌పోతున్న‌ట్టు టీడీపీ నేత‌లు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?