Advertisement

Advertisement


Home > Politics - Andhra

ష‌ర్మిలా హ‌ద్దు దాటొద్దు!

ష‌ర్మిలా హ‌ద్దు దాటొద్దు!

వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త‌న‌ను రాజ‌కీయ వ్య‌భిచారి అని ష‌ర్మిల విమ‌ర్శించ‌డంపై ఆయ‌న నిప్పులు చెరిగారు. ష‌ర్మిల ఒక‌టంటే, జ‌గ్గారెడ్డి ప‌ది తిట్లు తిట్టారు. ష‌ర్మిల‌కు జ‌గ్గారెడ్డి లాస్ట్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ్గారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు.  

మీ కుటుంబ పంచాయితీని కాస్త ప్రాంతాల మ‌ధ్య పంచాయితీ చేయ‌వ‌ద్దన్నారు. ఎటూ మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఆంధ్రాలో న‌డుస్తోంద‌న్నారు. మూడు రాజ‌ధానుల‌కు బ‌దులు మూడు రాష్ట్రాల‌ను చేసుకుని ముగ్గురు ముఖ్య‌మంత్రులు అయ్యేలా ప్లాన్ చేసుకోవాల‌ని జ‌గ్గారెడ్డి విజ‌య‌మ్మ‌కు స‌ల‌హా ఇచ్చారు. ఎటూ అమ‌రావ‌తికి సీఎంగా జ‌గ‌న్ ఉన్నార‌న్నారు. క‌డ‌ప లేదా క‌ర్నూలుకు ష‌ర్మిల‌, విశాఖ‌లో ఆల్రెడీ క‌బ్జా చేసిన విజ‌య‌సాయిరెడ్డి సీఎంగా ఉంటార‌ని వ్యంగ్యంగా అన్నారు. ప్ర‌ధాని మోదీకి సీఎం జ‌గ‌న్ గులాంగిరి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ప్ర‌ధాని వింటార‌న్నారు. మీ (ష‌ర్మిల‌) కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి కావ‌డానికి ఆంధ్రాలోనూ, తెలంగాణ‌లోనూ జ‌గ‌డాలు ఉండాల్సిందేనా అని ప్ర‌శ్నించారు.

ష‌ర్మిల ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా జీవితంలో తెలంగాణ‌లో నాయ‌కురాలు కాలేద‌ని జ‌గ్గారెడ్డి తేల్చి చెప్పారు. ష‌ర్మిల‌ను సీఎం చేయాల‌ని అనుకుంటే జ‌గ‌న్‌కు విజ‌య‌మ్మ న‌చ్చ చెప్పాల‌ని జ‌గ్గారెడ్డి సూచించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి ప్ర‌త్య‌ర్థుల‌ను ష‌ర్మిల తిడుతున్నార‌ని అన్నారు. ఆడ‌పిల్ల కాబ‌ట్టి ఆమెను ఏమీ అన‌లేక‌పోతున్నార‌ని జ‌గ్గారెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూతురు కాబ‌ట్టి కాంగ్రెస్ నాయ‌కులు తిట్ట‌ర‌న్నారు.

బీజేపీకి ష‌ర్మిల ఏజెంట్‌, బినామీ అని ఘాటు విమ‌ర్శ చేశారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ అయినంత మాత్రాన రాజ‌కీయ వ్య‌భిచారా? అంటావా? అస‌లు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? మ‌గ‌వాళ్ల‌తో ఎలా మాట్లాడాలో తెలియ‌దా? ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో అని ష‌ర్మిల‌కు జ‌గ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కంట్రోల్‌లో వుండాల‌ని ష‌ర్మిల‌కు జ‌గ్గారెడ్డి సూచించారు. త‌న‌ను రాజ‌కీయ వ్య‌భిచారి అంటున్న ష‌ర్మిల‌... తాను అదే మాట అంటే ఎలా వుంటుంద‌ని జ‌గ్గారెడ్డి నిల‌దీయడం గ‌మ‌నార్హం.

తాను కూడా చాలా విష‌యాలు మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు. హ‌ద్దుమీరి మాట్లాడొద్దు అని హిత‌వు ప‌లికారు. శీలం గురించి ఇంకోసారి మాట్లాడొద్ద‌ని ష‌ర్మిల‌కు జ‌గ్గారెడ్డి స‌ల‌హా ఇచ్చారు. ఇంకోసారి మాట్లాడితే మ‌రో ర‌కంగా బ్లాస్ట్ కావాల్సి వ‌స్తుంద‌ని ఘాటు హెచ్చ‌రిక చేశారు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా